Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ఆర్‌సీపీలో చేరిన మాజీ ఐఎఎస్ అధికారి ఇంతియాజ్: కర్నూల్ అసెంబ్లీ నుండి పోటీ

మాజీ ఐఎఎస్ అధికారి ఎం.డి. ఇంతియాజ్  వైఎస్ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు.  వీఆర్ఎస్ తీసుకున్న ఇంతియాజ్ రాజకీయాల్లోకి వచ్చారు

Former IAS Officer  Imtiaz Ahmed Joins in YSRCP lns
Author
First Published Feb 29, 2024, 2:40 PM IST

అమరావతి: మాజీ ఐఎఎస్ అధికారి  ఎం.డి. ఇంతియాజ్ గురువారంనాడు  వైఎస్ఆర్‌సీపీలో  చేరారు. ఇంతియాజ్ వీఆర్ఎస్ కు  రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే  ఆమోదం తెలిపింది.  ఇవాళ  ఇంతియాజ్  సీఎం జగన్ సమక్షంలో  వైఎస్ఆర్‌సీపీలో చేరారు.  సెర్ప్‌ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా   ఇంతియాజ్‌ బాధ్యతలు నిర్వహించారు.

also read:ఇండియాలో పవర్‌ఫుల్ వ్యక్తులు వీరే: టాప్ 1లో మోడీ

కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి  రానున్న ఎన్నికల్లో ఇంతియాజ్  వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధిగా పోటీ చేయనున్నారు.  ప్రస్తుతం  కర్నూల్ ఎమ్మెల్యేగా  హఫీజ్ ఖాన్ ఉన్నారు.   అయితే వచ్చే ఎన్నికల్లో హఫీజ్ ఖాన్ కు టిక్కెట్టు ఇవ్వబోమని పార్టీ నాయకత్వం స్పష్టం చేసింది.  మాజీ ఐఎఎస్ అధికారి  ఇంతియాజ్ ను  కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి బరిలోకి దింపనుంది  వైఎస్ఆర్‌సీపీ. అయితే  ప్రస్తుత ఎమ్మెల్యే  హఫీజ్ ఖాన్,  మాజీ ఎమ్మెల్యే  ఎస్‌.వీ. మోహన్ రెడ్డిలను రాజకీయంగా  ఆదుకొంటామని  సీఎం జగన్ హామీ ఇచ్చారు.

also read:తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ

అనంతరం  కర్నూల్ మాజీ ఎమ్మెల్యే  ఎస్. వీ. మోహన్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు. ఇంతియాజ్ తో కలిసి పని చేస్తానని చెేప్పారు. ఇంతియాజ్ ను కర్నూలులో గెలిపిస్తామన్నారు. కొండారెడ్డి బురుజు పై వైసీపీ జెండా ఎగరెస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.తమకు రాజకీయంగా అండగా ఉంటామని  సీఎం హామీ ఇచ్చారన్నారు.తమ రాజకీయ  భవిష్యత్ కంటే  పార్టీ ముఖ్యమని ఎస్.వీ. మోహన్ రెడ్డి చెప్పారు.పార్టీ బాగుంటే తామంతా బాగుంటామన్నారు. 

సీఎం నిర్ణయం మేరకు  ఇంతియాజ్ ను గెలిపిస్తామని కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చెప్పారు. మైనార్టీలకు జగన్ అండగా ఉన్నారన్నారు.మెజార్టీ స్థానాల్లో మైనారిటీలకు సీఎం అవకాశం కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

also read:ఎన్నికల మేనిఫెస్టో‌పై కసరత్తు: పార్టీ నేతలతో జగన్ చర్చలు

ప్రతి ఒక్కరూ బాగుండాలని అనేది జగన్ మోహన్ రెడ్డి  ఆలోచనగా  హఫీజ్ ఖాన్ చెప్పారు.జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు తన అడుగులు ఉంటాయన్నారు.జగన్ సీఎం అవ్వడం తనకు ముఖ్యంగా హఫీజ్ ఖాన్ చెప్పారు. తాను ఎక్కడ పోటీ చేయడం లేదన్నారు. తన గౌరవం, తన స్థానం ఎక్కడ తగ్గకుండా చూస్తానని సీఎం హామీ ఇచ్చారని హఫీజ్ ఖాన్ వివరించారు.

also read:బెంగాల్ లో టీఎంసీ నేత అరెస్ట్: సందేశ్ ఖాళీలో ఆందోళనలెందుకు, ఎవరీ షేక్ షాజహాన్ ?

ఈ దఫా జరిగే ఎన్నికల్లో  గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని  జగన్ నిర్ణయం తీసుకున్నారు. దరిమిలా  రాష్ట్రంలోని  పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చారు.  ఇప్పటికే  60కిపైగా అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చుతూ  నిర్ణయం తీసుకున్నారు.



 

Follow Us:
Download App:
  • android
  • ios