ఎన్నికల మేనిఫెస్టో‌పై  వై.ఎస్. జగన్ కేంద్రీకరించారు. మేనిఫెస్టో‌లో చేర్చాల్సిన అంశాలపై  పార్టీ నేతలతో  జగన్ చర్చించనున్నారు.

అమరావతి: ఎన్నికల మేనిఫెస్టో‌పై యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్‌సీపీ) పై ఫోకస్ పెట్టింది. గురువారంనాడు మధ్యాహ్నం పార్టీ సీనియర్లతో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు.మేనిఫెస్టో‌పై జగన్ చర్చించనున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

2019 ఎన్నికల సమయంలో నవరత్నాలను వైఎస్ఆర్‌సీపీ ప్రకటించింది. నవరత్నాలతో పాటు క్షేత్రస్థాయి నుండి వచ్చిన అభ్యర్థనల మేరకు మరికొన్ని పథకాలను కూడ మేనిఫెస్టో‌లో చేర్చే విషయమై పార్టీ నేతలతో జగన్ చర్చించనున్నారు.

also read:తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ

ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలను కొనసాగించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ పథకాలకు తోడుగా కొత్త పథకాలు చేర్చాలని ఆ పార్టీ భావిస్తుంది. మహిళలను ఆకర్షించేలా ఈ పథకాలకు ఆ పార్టీ నాయకత్వం వ్యూహ రచన చేస్తుంది.రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ మేనిఫెస్టోలో పెట్టే విషయమై పార్టీ నేతలతో చర్చించనున్నారు.మధ్యపాన నిషేధంపై కూడ మేనిఫెస్టో‌లో స్పష్టత ఇవ్వనుంది.

also read:బెంగాల్ లో టీఎంసీ నేత అరెస్ట్: సందేశ్ ఖాళీలో ఆందోళనలెందుకు, ఎవరీ షేక్ షాజహాన్ ?

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం లేకపోలేదు. ఈ విషయమై ఈ మాసంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేనాటికి మేనిఫెస్టో‌ను విడుదల చేయాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తుంది.

also read:ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతలు: ఎంపీ అభ్యర్థులను ఫైనల్ చేయనున్న అధిష్టానం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనుంది వైఎస్ఆర్‌సీపీ. తెలుగుదేశం, జనసేనలు కూటమిగా ఏర్పడి పోటీ చేయనున్నట్టుగా ప్రకటించాయి.ఇప్పటికే 99 మంది అభ్యర్థులను ఈ రెండు పార్టీలు ప్రకటించాయి. ఈ రెండు పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో కూడ త్వరలోనే విడుదల కానుంది.