Asianet News TeluguAsianet News Telugu

బెంగాల్ లో టీఎంసీ నేత అరెస్ట్: సందేశ్ ఖాళీలో ఆందోళనలెందుకు, ఎవరీ షేక్ షాజహాన్ ?

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో  దాదాపు 50 రోజులుగా  సందేశ్ ఖాళీలో ఆందోళనలు సాగుతున్నాయి.  షేక్ షాజహాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Who is Sheikh Shahjahan, the TMC strongman of Sandeshkhali in West Bengal? lns
Author
First Published Feb 29, 2024, 11:00 AM IST

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 24 పరగణాల జిల్లాకు చెందిన తృణమూల్ కాంగ్రెస్ నేత  షేక్ షాజహాన్ ను గురువారం నాడు పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు మాసాలుగా షాజహాన్ పరారీలో ఉన్నాడు.  ఈ ఏడాది జనవరి  5వ తేదీ నుండి షాజహాన్  పరారీలో ఉన్నాడు.45 ఏళ్ల షాజహాన్ 2013లో  టీఎంసీలో  చేరారు.టీఎంసీలో చేరకముందు సందేశ్ ఖాళీలో  సర్బేరియాలోని ప్రయాణీకుల నుండి చార్జీలు వసూలు చేస్తూ  డ్రైవర్ గా , అతనికి సహాయకుడిగా  షాజహాన్ పనిచేశాడు.  స్థానికంగా పంచాయితీ స్థాయి సీపీఐ(ఎం) నాయకుడైన మోసలేం షేక్  షాజహాన్ మామ.  చిన్నతనంలో  షాజహాన్ మామ నీడలోనే పెరిగాడు.

also read:తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ

షాజహాన్ క్రమంగా చేపల వ్యాపారంలోకి ప్రవేశించాడు.  చేపల పెంపకాలను నియంత్రించాడు.చేపల పెంపకంలో షాజహాన్  తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. స్థానికంగా ఉన్న పార్టీ నేతలతో  సన్నిహితంగా ఉండేవాడు2011లో  పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో  టీఎంసీ అధికారంలోకి వచ్చిన సమయంలో మాజీ మంత్రి జ్యోతి ప్రియా మల్లిక్  షాజహాన్ కు ప్రజల్లో ఉన్న ఆదరణను గుర్తించారు.మల్లిక్ రేషన్ పంపినీ కుంభకోణంలో  ఆరోపణల నేపథ్యంలో జైలుకు వెళ్లాడు.మల్లిక్  జైలుకు వెళ్లడానికి ముందు మల్లిక్ కు అత్యంత సన్నిహితుడిగా  షాజహాన్ కు పేరుంది.  షాజహాన్  2013లో టీఎంసీలో చేరాడు. స్థానికంగా  ప్రజాదరణను  షాజహన్ పొందాడు.

also read:ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతలు: ఎంపీ అభ్యర్థులను ఫైనల్ చేయనున్న అధిష్టానం

షాజహాన్  ఇంట్లో ఈ ఏడాది జనవరి  5న  ఈడీ అధికారులు  సోదాలు చేయడానికి వచ్చారు. అయితే  ఈ సమయంలో ఈడీ అధికారులపై  స్థానికులు దాడి చేశారు.ఈ దాడిలో  సుమారు ముగ్గురు అధికారులు గాయపడ్డారు. అప్పటి నుండి  షాజహాన్  పరారీలో ఉన్నాడు.షాజహాన్ పై  సుమారు  43 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ విషయాన్ని అడ్వకేట్ జనరల్  కిషోర్ దత్తా  కోల్‌కత్తా హైకోర్టుకు తెలిపారు.  

 రూ.19.8 లక్షల వార్షిక ఆదాయం కలిగి  రూ. 1.9 కోట్ల కంటే ఎక్కువ బ్యాంకు డిపాజిట్లు కలిగినట్టుగా ఎన్నికల సమయంలో  సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా తెలుస్తున్నాయి.షాజహాన్ కు ముగ్గురు పిల్లలున్నారు.  సుమారు రూ. 4 కోట్ల విలువైన భూమి, సర్బేరియాలో రూ. 1.5 కోట్ల విలువైన ఇల్లుంది.  షాజహాన్ కు కనీసం 17 బైక్ లున్నాయి.మమత బెనర్జీ ప్రభుత్వం షాజహాన్ కు  రక్షణ కల్పిస్తుందని  విపక్షాలు ఆరోపిస్తుంది.కోల్‌కత్తా హైకోర్టు స్టే ఇవ్వడంతో  ప్రభుత్వం ఆయనను అరెస్ట్ చేయలేదు.


సందేశ్ ఖాళీలో  నిరసనలు ఎందుకంటే?

షాజహాన్  ఇంటిపై ఈడీ అధికారుల సోదాల నేపథ్యంలో ఆయన పరారీలో ఉన్నారు. అయితే  అదే సమయంలో  సందేశ్ ఖాళీలో  స్థానిక మహిళలు  షాజహాన్ కు వ్యతిరేకంగా  పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు.  ఈ విషయమై  పోలీసులకు ఫిర్యాదులు చేశారు.  గిరిజన కుటుంబాలు జాతీయ ఎస్‌టీ కమిషన్ కు  షాజహాన్ కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు.మహిళలపై లైంగిక వేధింపులు,  భూకబ్జాలకు సంబంధించి ఫిర్యాదులు చేశారు.  భూ సమస్యలకు సంబంధించి 400 సహా  1250 ఫిర్యాదులు అందినట్టుగా  ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.

మహిళలపై షాజహాన్ లైంగిక వేధింపులకు సంబంధించి నిరసనలు తీవ్రమయ్యాయి. షాజహాన్ ను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. విపక్ష పార్టీలు  ఈ ఆందోళనలకు మద్దతుగా నిలిచాయి. దీంతో సందేష్ ఖాళీలో  గత కొన్ని రోజులుగా  ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్థానికంగా టీఎంసీ నేతలను లక్ష్యంగా చేసుకొని  మహిళలు నిరసనలకు దిగారు.

కోల్‌కత్తాకు సుమారు 75 కి.మీ. దూరంలో సందేశ్ ఖాళీ గ్రామం ఉంటుంది.  షాజహాన్ పై ఈడీ అధికారుల సోదాల నేపథ్యంలో అతను పరారీలో ఉన్నాడు. ఈ అవకాశాన్ని స్థానికులు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. షాజహాన్ , అతని అనుచరులు  అకృత్యాలకు పాల్పడినట్టుగా  ఆరోపించారు.  తుపాకులతో బెదించింది తమపై లైంగిక దాడులకు దిగినట్టుగా  మీడియా ఎదుట కొందరు మహిళలు ఆరోపణలు చేశారు.

 టీఎంసీ శ్రేణులు తమపై దాడులు, దౌర్జన్యాలకు దిగారని  బాధితులు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలోనే  తమపై దాడి చేశారని  బాధితులు ఆరోపణలు చేశారు.ఈ విషయమై  స్థానిక మీడియా కూడ పెద్ద ఎత్తున  కథనాలు ప్రసారం చేశాయి. కొందరు బాధితులు కోర్టును ఆశ్రయించారు. షెడ్యూల్డ్ కులాల,షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్, మహిళా కమిషన్ ఉన్నతాధికారులు కూడ  ఈ ప్రాంతాన్ని సందర్శించారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి  బాధితుల నుండి స్టేట్ మెంట్ తీసుకున్నారు.తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios