తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ

తెలంగాణలో  టీచర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.ఈ మేరకు ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది.

Telangana DSC Notification 2024 released, Registration begins for 11,062 teacher posts lns


హైదరాబాద్: తెలంగాణలో  11,062 టీచర్ పోస్టుల భర్తీ చేసేందుకు గాను  రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో తెలంగాణలో  కేసీఆర్ సర్కార్  జారీ చేసిన  డీఎస్‌సీ నోటిఫికేషన్ ను  రేవంత్ రెడ్డి సర్కార్ రద్దు చేసింది.  

also read:బెంగాల్ లో టీఎంసీ నేత అరెస్ట్: సందేశ్ ఖాళీలో ఆందోళనలెందుకు, ఎవరీ షేక్ షాజహాన్ ?

కేసీఆర్ సర్కార్ కేవలం  ఐదు వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ నోటిఫికేషన్ ను రద్దు చేసి ఆ స్థానంలో ఇవాళ కొత్త నోటిఫికేషన్ ను జారీ చేసింది.

also read:ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతలు: ఎంపీ అభ్యర్థులను ఫైనల్ చేయనున్న అధిష్టానం

 గతంలో జారీ చేసిన ఐదు వేల పోస్టులకు తోడు మరో ఆరు వేల పోస్టులను  అదనంగా భర్తీ చేయాలని  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో  11,062 టీచర్ పోస్టులను భర్తీ చేయడం కోసం మెగా డీఎస్‌సీ నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ విడుదల చేసింది. 

 

ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  మెగా డీఎస్‌సీ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. డీఎస్‌సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వయస్సును 46 ఏళ్లు ఉండాలి. ఈ ఏడాది మార్చి 4వ తేదీ నుండి ఏప్రిల్  రెండో తేదీ వరకు  ధరఖాస్తులను స్వీకరించనున్నారు.డీఎస్‌సీ కోసం అప్లయ్ చేయడం కోసం  పరీక్ష ఫీజును రూ. 1000గా నిర్ణయించారు.ఆన్ లైన్ పద్దతిలో డీఎస్‌సీ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా  ఈ పరీక్ష నిర్వహణ కోసం  11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్ష నిర్వహించే తేదీలను త్వరలోనే ప్రకటించనుంది ప్రభుత్వం.గతంలో డీఎస్‌సీకి ధరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ ధరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని  ప్రభుత్వం స్పష్టం చేసింది.

2023 సెప్టెంబర్ 6వ తేదీన  5,089 టీచర్ పోస్టుల భర్తీ కోసం  కేసీఆర్ సర్కార్  డీఎస్‌సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.  అయితే  టీచర్ పోస్టులను అన్నింటిని భర్తీ చేయాలని అప్పట్లో నిరుద్యోగులు ఆందోళనకు దిగారు.  అయితే  అదే సమయంలో  ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో డీఎస్‌సీ నిర్వహించలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్ఎస్ ఓటమి పాలై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.  కాంగ్రెస్ సర్కార్   గత ప్రభుత్వం విడుదల చేసిన  డీఎస్‌సీ నోటిఫికేషన్ ను రద్దు చేసింది. ఇవాళ  కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 

భర్తీ చేయనున్న పోస్టులు


ఎస్‌జీటీ :6,508
పీఈటీ : 182
స్కూల్ అసిస్టెంట్లు:2,629
భాషా పండితులు:727
స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్):220 
ఎస్‌జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్):796 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios