రాజమహేంద్రవరం: ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత ఎస్‌ జగన్‌పై జరిగిన దాడి విషయంలో సీఎం చంద్రబాబు ఫ్యాక్షనిస్టులా స్పందించారని మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడికి సంఘీభావం తెలిపితే చంద్రబాబుకు అంత కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు. 

చిన్నకత్తితో దాడి చేసినా ప్రాణాపాయం ఉంటుందన్న హర్షకుమార్ 1996లో తనపై జరిగిన హత్యాయత్నమే అందుకు నిదర్శనమని గుర్తు చేశారు. భుజంపై  కాకుండా  మెడపై  దాడి చేసి ఉంటే జగన్‌కు ప్రాణాపాయం ఏర్పడేదన్నారు. 

జగన్‌కు దగ్గరయ్యేందుకు తాను ఇలా మాట్లాడటం లేదని ఘటనకు సంబంధించి వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు. నిందితుడు ఏ పార్టీకి చెందిన వాడనే విషయాన్ని పక్కన పెట్టి దాడి వెనక ఉద్దేశాన్ని బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో జరిగే ప్రతి విషయానికి చంద్రబాబు ఎందుకు ఇంతలా భయపడుతున్నారో అర్థం కావడంలేదన్నారు. 
దళితులపై టీడీపీ నాయకులు చేస్తున్న దాడుల వల్లే గోదావరి జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఈ నెల 28న ఛలో అమలాపురం ఆందోళన కార్యక్రమానికి పిలుపినిచ్చినట్లు హర్షకుమార్ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి

సీఎం, రాజప్ప రాజీనామా చెయ్యాలి, శివాజీని అరెస్ట్ చెయ్యాలి: మాణిక్యాల రావు డిమాండ్

ఎపి పోలీసులపై వ్యాఖ్య: జగన్ నష్టనివారణ చర్యలు

జగన్నాటకం రక్తికట్టలేదు, రాష్ట్రపతి పాలనకు కుట్ర:గంటా

నేను చెప్పాలనుకున్నదే లేఖలో రాశా...అది చూసుకోండి: నిందితుడు శ్రీనివాస్

కోర్టుకు శ్రీనివాస్, 9ఫోన్ లు ఒకే సిమ్, మరోకత్తి స్వాధీనం :జగన్ కేసుపై విశాఖ సీపీ లడ్డా

పవన్ కళ్యాణ్ పై దాడికి కుట్ర:కన్నా సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

జగన్ "కేంద్రం"గా చంద్రబాబు రాజకీయం

ఆపరేషన్ గరుడ నమ్మాల్సి వస్తే శివాజీని ప్రశ్నించండి:టీడీపీకి రోజా కౌంటర్

జగన్ పై దాడి: లేఖ మడతలు పడలేదు, ఒక్కో పేజీలో ఒక్కో రాత