Asianet News TeluguAsianet News Telugu

విఫల ప్రయోగమే: కేసీఆర్ ఫ్రంట్ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్

తెలంగాణ ఎన్నికల ఫలితాలు వేరు, మిగిలిన రాష్ట్రాల ఫలితాలు వేరని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.
 

chandrababunaidu reacts on kcr front comments
Author
Amaravathi, First Published Dec 12, 2018, 11:31 AM IST


అమరావతి: తెలంగాణ ఎన్నికల ఫలితాలు వేరు, మిగిలిన రాష్ట్రాల ఫలితాలు వేరని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

బుధవారం నాడు  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పార్టీ నాయకులు, ముఖ్య నేతలతో  టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో  మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

మిగిలిన రెండు రాష్ట్రాల్లో  ప్రాంతీయ పార్టీలే విజయం సాధించినట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఫలితాలు ఇతర రాష్ట్రాల ఫలితాలతో పోల్చకూడదని బాబు చెప్పారు.

దేశంలో బీజేపీ పాలన పోవాలని ప్రజలు కోరుకొంటున్నారని ఆయన  చెప్పారు. ఈ మేరకు ఐదు రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలను ఆయన ప్రస్తావించారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చిందన్నారు.  హోదా ఇవ్వని బీజేపీ మనకు ప్రధమ శత్రువని చెప్పారు.

రెండు, మూడు పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చేయడం విఫల ప్రయోగమేనని చంద్రబాబునాయుడు పరోక్షంగా కేసీఆర్ ఏర్పాటు చేయదల్చిన ఫ్రంట్‌పై వ్యాఖ్యానించారు. ఈ తరహా కూటమి బీజేపీకి ఉపయోగపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

బీజేపీపై  పోరాటానికి కేసీఆర్ కలిసి రాలేదని చంద్రబాబునాయుడు ఆరోపించారు.బీజేపీపై పోరాటానికి కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలు కలిసి రావాల్సిన అవసరం ఉందని  చంద్రబాబు చెప్పారు.

సంబంధిత వార్తలు

అసద్‌తో కలిసి దేశ రాజకీయాలను మలుపు తిప్పుతా: కేసీఆర్

నెల ఆగండి, దేశ రాజకీయాల్లో సత్తా చాటుతా: కేసీఆర్

చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తా, ఫలితం చూస్తారు: కేసీఆర్ హెచ్చరిక
శనేశ్వరం ఓడి కాళేశ్వరం గెలిచింది: ఫలితాలపై కేసీఆర్

Follow Us:
Download App:
  • android
  • ios