హైదరాబాద్: దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని  కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌ ఓవైసీతో కలిసి దేశ వ్యాప్తంగా పర్యటించనున్నారు.

దేశ రాజకీయాల్లో  చక్రం తిప్పేందుకు కేసీఆర్ వ్యూహత్మకంగా అడుగులు వేయనున్నారు. దేశానికి తెలంగాణ మోడల్ రాజకీయాలను  చూపుతామపి  కేసీఆర్  ప్రకటించారు.

 కాంగ్రెస్, బీజేపీల నుండి దేశం విముక్తి కావాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.దేశంలో  మైనార్టీల సంక్షేమం కోసం  అనుసరించాల్సిన వ్యూహంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీతో కేసీఆర్ చర్చించారు.

డిసెంబర్ 10వ తేదీన కేసీఆర్‌  ఈ విషయమై  అసదుద్దీన్‌తో చర్చించారు.  దేశంలో మైనార్టీలు ఎంత శాతం ఉన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటనే విషయమై వీరిద్దరూ  చర్చించారు.  

దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్ తో కలిసి కేసీఆర్ పర్కటించనున్నారు. అసద్‌ సెక్యులరిస్ట్‌ అంటూ కేసీఆర్ అయనను పొగడ్తలతో ముంచెత్తారు.
తెలంగాణలో ప్రజలను ఏకం చేసిన తరహలోనే దేశంలో కూడ ప్రజలను ఏకం చేస్తామని  చెప్పారు. 

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నాలు చేస్తామని  కేసీఆర్ చెబుతున్నారు. గుణాత్మక మార్పును నెల రోజుల్లోనే  చూస్తారని  కేసీఆర్ ప్రకటించారు. ఈ విషయమై పలు పార్టీలతో చర్చించేందుకు కేసీఆర్  త్వరలోనే ఢిల్లీకి వెళ్లనున్నారు.

సంబంధిత వార్తలు

నెల ఆగండి, దేశ రాజకీయాల్లో సత్తా చాటుతా: కేసీఆర్

చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తా, ఫలితం చూస్తారు: కేసీఆర్ హెచ్చరిక
శనేశ్వరం ఓడి కాళేశ్వరం గెలిచింది: ఫలితాలపై కేసీఆర్