చంద్రబాబు నాయుడికి ఖైదీల మాదిరిగా జైలు భోజనమే పెట్టాలి - ఎంపీ గోరంట్ల మాధవ్
చంద్రబాబు నాయుడుకు కూడా ఇతర ఖైదీల మారిగానే జైలు భోజనమే పెట్టాలని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. లేకపోతే భవిష్యత్తులో ఇతర ఖైదీలకు కూడా తమకు ఇంటి భోజనం కావాలని అడుగుతారని అన్నారు. రాబోయే కాలంలో టీడీపీ అధినేత మరిన్ని కేసుల్లో అరెస్టు అవుతారని తెలిపారు.

చంద్రబాబు నాయుడికి జైలులో అక్కడి ఖైదీలు తినే భోజనమే పెట్టాలాలని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఆయనకు ఇంటి నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక భోజనం పెట్టడం సరైంది కాదని అన్నారు. భవిష్యత్తులో ఇతర ఖైదీలు కూడా తాము కూడా ఇంటి భోజనమే తింటామని డిమాండ్ చేస్తారని అన్నారు. అలా చేయడం కూడా న్యాయమే అవుతుందని చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
దారుణం..సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదిని హతమార్చిన భర్త, మాజీ ఐఐఎస్ ఆఫీసర్..
ప్రజాస్వామ్య దేశంలో అవినితీకి పాల్పడిన ప్రతీ ఒక్కరు శిక్షను అనుభవించాల్సిందే అని ఆయన అన్నారు. తక్షణమే చంద్రబాబు నాయుడికి జడ్ ప్లస్ భద్రతను ఉపసంహరించాలని తెలిపారు. భవిష్యత్ లో టీపీడీ అధినేత మరిన్ని కేసుల్లో అరెస్టు అవుతారని జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు పాపం పండిందని అన్నారు. ఇంత కాలం ఆయన వ్యవస్థలను మ్యానేజ్ చేసుకుంటూ వచ్చారని తెలిపారు. ఇక నుంచి భగవంతుడు ఆయనను క్షమించబోడని తెలిపారు.
పోలీసులు చట్టం ప్రకారమే చంద్రబాబు నాయుడిని అరెస్టు చేశారని అన్నారు. ఈ కేసులో కొందరు బయటి దేశాలకు పారిపోయారని తెలిపారు. ఈ పరిణామాలే ఇది ఎంత పెద్ద కేసు తెలియజేస్తుందని చెప్పారు. మహారాష్ట్రలోని పూణెకు చెందిన ఓ సోషల్ యాక్టివిస్ట్ దీనిపై మొదటగా ఫిర్యాదు చేశాడని మాధవ్ తెలిపారు. దాంతోనే ఈ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ వెలుగులోకి వచ్చిందని అన్నారు.
రైలు, ప్లాట్ ఫామ్ కు మధ్యన ఇరుకున్న మిత్రుడి భార్యను కాపాడబోయి.. స్నేహితుడు మృతి
ఈ కేసు విచారణలో చంద్రబాబు నాయుడు రూ.240 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని తేలిందని అన్నారు. అందుకే ఆయనను పోలీసులు అరెస్టు చేశారని, తరువాత జైలుకు తరలించారని చెప్పారు. గతంలో ఆయనపై ఏ అవినీతి ఆరోపణలు వచ్చినా కోర్టకు వెళ్లి, స్టే తెచ్చుకునే వారని గుర్తుచేశారు. కానీ ఆయన చేసిన అవినీతి పనులకు జీవితాంతం జైలులోనే ఉండాల్సి ఉంటుందని తెలిపారు. ఆయనను అరెస్టు చేస్తే ఏపీ ప్రజల నుంచి ఎలాంటి స్పందనా లేదని అన్నారు. ఈ విషయాన్ని టీడీపీ నాయకులే చెబుతున్నారని ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు.
దళిత యువకుడిపై ఎస్ఐ దాష్టీకం.. తలను జీపుకేసి అదిమిపెట్టి.. గదమాయింపు..
కదిరిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసిన అనంతరం ఆయన మళ్లీ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం వల్ల దివంగత సీఎం ఎన్టీ రామారావు ఆత్మకు శాంతి చేకూరి ఉంటుందని ఆయన అన్నారు. కూతురును ఇచ్చి పెళ్లి చేసినందుకు.. ఎన్టీఆర్ పదవినే లాక్కురని ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపించారు. దీనిని తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ చూశారని తెలిపారు. కానీ ఆయనను ఎదురించలేక ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చంద్రబాబుతో కలిసిపోయినప్పటికీ.. ఇప్పుడు సంతోషంగా ఉన్నారని అన్నారు. 74 ఏళ్ల వయస్సులో చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లాడని, ఇది భగవంతుడు రాసిన స్క్రిప్ట్ అని తెలిపారు.