పోలీసులు మానసిక వేధింపులకు గురి చేశారు.. కోర్టుకు వచ్చే కొంచెం ముందే రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు - చంద్రబాబు
పోలీసులు శారీరక వేధింపులకు గురి చేయలేదని, కానీ మానసిక వేధింపులకు గురి చేశారని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆదివారం ఉదయం వరకు రోడ్లపై, తనను వాహనంలో తిప్పారని చెప్పారు. ఏసీబీ కోర్టులో న్యాయాధికారి ఇచ్చిన వాగ్మూలంలో ఆయన ఈ విషయాలు ప్రస్తావించారు.

పోలీసులు తనను మానసిక వేధింపులకు గురి చేశారని టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రాథమిక సాక్షాధారాలు లేకుండానే తనను అరెస్టు చేశారని ఆరోపించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు అయిన తరువాత ఆయనను ఆదివారం ఉదయం విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఆయన న్యాయాధికారి హిమబిందు ఎదుట వాగ్మూలం ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారని ‘ఈనాడు’ కథనం పేర్కొంది.
అలాంటి వారికి ప్రజలే గుణపాఠం చెబుతారు: రాహుల్ పై సింధియా ఫైర్
మొదట ఓ డాక్టర్ సీఐడీ కస్టడీలో ఉండగానే తనకు పరీక్షలు చేశారని చెప్పారు. తరువాత విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లి టెస్టులు చేశారని అన్నారు. అందులో తనకు బీపీ, షుగర్ లెవెల్ పెరిగిందని నిర్ధారణ అయ్యిందని చెప్పారు. స్కిల్ డెవల్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేతను ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ కు పంపిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీ సోమమారం బయటకు విడుదలైంది. అందులో ఈ వివరాలు ఉన్నాయి.
వచ్చే ఏడాది 'సముద్రయాన్' .. 'మత్స్య 6000' జలాంతర్గామి ఫోటోలను షేర్ చేసిన కేంద్రమంత్రి
తాను బస చేసిన ప్రాంతానికి శుక్రవారం రాత్రి 11 గంటలకే పోలీసులు రావడం మొదలైందని చెప్పారు. మరుసటి రోజు 5 నుంచి 5.30 గంటల మధ్య సీఐడీ డీఐజీ, కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తన దగ్గరకు వచ్చారని చెప్పారు. వారిని పరిచయం చేసుకున్నారని చెప్పారు. ఎందుకు వచ్చారని తాను ప్రశ్నించారని, దీంతో వారు అరెస్టు నోటీసు ఇచ్చారని అన్నారు. అయితే తాను కేసు వివరాలు అడిగానని, కానీ దానికి వారు సమాధానం చెప్పలేదని తెలిపారు.
గోద్రా తరహా ఘటనలు.. ఉద్ధవ్ థాకరేపై అనురాగ్ ఠాకూర్ ఫైర్..
అయితే పోలీసులు దురుసుగా ప్రవర్తించారా అని న్యాయాధికారి చంద్రబాబు నాయుడిని ప్రశ్నించారు. దానికి ఆయన సమాధానం ఇస్తూ.. శారీరకంగా ఇబ్బందులకు గురి చేయలేదని అన్నారు. కానీ తనను మానసికంగా వేధింపులకు గురి చేశారని చెప్పారు. తనను వాహనంలో, రోడ్లపై ఆదివారం ఉదయం 6 గంటల సమయం వరకు తిప్పారని చెప్పారు. మొట్టమొదట ఎఫ్ఐఆర్ నోటీసులు ఇచ్చారని తెలిపారు. కానీ కోర్టులో హాజరుపరిచేందుకు కొంత ముందు మాత్రమే రిమాండ్ నోటీసులు అందించారని చంద్రబాబు నాయుడు చెప్పారు.