దళిత యువకుడిపై ఎస్ఐ దాష్టీకం.. తలను జీపుకేసి అదిమిపెట్టి.. గదమాయింపు..
ఏపీలో ఆదివారం టీడీపీ బంద్ నిర్వహించింది. అయితే ఈ సమయంలో ఓ దళిత యువకుడిపై ఎస్ఐ దురుసుగా ప్రవర్తించాడు. షర్ట్ పట్టుకొని లాకెళ్లి, పోలీసు వాహనానికి అదిమిపెట్టాడు. ఈ ఘటన బాపట్ల జిల్లా వేమూరులో జరిగింది.

స్కిల్ డెవల్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టయిన నేపథ్యంలో ఏపీలో ఆదివారం టీడీపీ బంద్ కు పిలుపునిచ్చింది. అందులో భాగంగా టీడీపీ శ్రేణులు రాష్ట్రంలోని పలు చోట్ల బంద్ లో పాల్గొన్నారు. అయితే బాపట్ల జిల్లా వేమూరులో కూడా ఆ పార్టీ నాయకులు బంద్ చేస్తుండగా.. అక్కడ పోలీసులు అత్యుత్సాహం చూపెట్టారు. ఓ దళిత యువకుడిపై దాష్టీకంగా ప్రవర్తించారు.
జంపని గ్రామానికి చెందిన కే.సుధాకర్ దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు. ఆయన స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులతో కలిసి బంద్ లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో బ్యాంక్ ను మూసేందుకు వారు ప్రయత్నించారు. అదే సమయంలో వేమురు ఎస్ ఇన్ స్పెక్టర్ నాగరాజు అక్కడికి చేరుకున్నారు. ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బంద్ నిర్వహిస్తున్నామని అక్కడే ఉన్న సుధాకర్ జవాబు చెప్పాడు.
దారుణం..సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదిని హతమార్చిన భర్త, మాజీ ఐఐఎస్ ఆఫీసర్..
దీనికి ఎస్ ఐ మండిపడ్డాడు. బంద్ కు పర్మిషన్ లేదని చెప్పారు. నడు, జీపు ఎక్కు అంటూ సుధాకర్ ను గదామాయించాడు. అనంతరం షర్ట్ పట్టుకొని లాక్కెళ్లాడు. దీంతో పాటు అతడి తలను రెండు, మూడు సార్లు ఆ పోలీసు వాహనానికి అదిమెట్టారు. అనంతరం బలవంతంగా వాహనం ఎక్కించారు. తరువాత పోలీసు స్టేషన్ కు తీసుకొని వచ్చారు. అయితే తాను అనారోగ్యంతో ఉన్నానని అతడు చెప్పడంతో సబ్ ఇన్సిపెక్టర్ వదిలిపెట్టాడు.