రైలు, ప్లాట్ ఫామ్ కు మధ్యన ఇరుకున్న మిత్రుడి భార్యను కాపాడబోయి.. స్నేహితుడు మృతి
ప్రమాదంలో చిక్కుకున్న మిత్రుడి భార్యను కాపాడే ప్రయత్నంలో మరో స్నేహితుడు మరణించాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. దీనిపై జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు మొదలుపెట్టారు.

అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రైలుకు, ప్లాట్ ఫామ కు మధ్యన ఇరుకున్న మిత్రుడి భార్యను కాపాడబోయి ఓ స్నేహితుడు ప్రమాదానికి గురై మరణించాడు. ఈ ఘటనకు కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. యూపీలోని అవాజ్ పూర్ కు చెందిన 34 ఏళ్ల రక్షపాల్ అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురంకు వలస వచ్చాడు. ఆయన తన మిత్రుడైన మున్నాకూమార్, అతడి భార్య హీరామతితో కలిసి అదే గ్రామంలో ఉన్న ఓ సిమెంట్ ఇటుకల ఫ్యాక్టరీలో పనికి కుదిరాడు.
వీరంతా కలిసి ఆ ఫ్యాక్టరీలో దినసరి కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా.. మున్నాకూమర్, తన భార్యతో కలిసి స్వస్థలానికి వెళ్లి రావాలని నిర్ణయించుకున్నాడు. దాని కోసం వారు అనంతపురం రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. వారికి తోడుగా రక్షపాల్ కూడా అక్కడికి చేరుకున్నాడు. ఆదివారం రాత్రి పదకొండున్నర సమయంలో వారి ఎక్కే రైలు స్టేషన్ కు వచ్చింది. వారుతమ బోగి వెతుక్కొని రైలు ఎక్కే లోపే ముందుకు కదలడం ప్రారంభించింది.
దళిత యువకుడిపై ఎస్ఐ దాష్టీకం.. తలను జీపుకేసి అదిమిపెట్టి.. గదమాయింపు..
ఈ క్రమంలో ఎలాగోలా మున్నాకుమార్ రైలు ఎక్కాడు. హీరామతి కూడా రైలు ఎక్కేందుకు ప్రయత్నించింది. ఈ సమయంలో ఆమె కాలు జారి రైలుకు, ప్లాట్ ఫామ్ కు మధ్యలో ఇరుక్కుంది. దీనిని గమనించిన రక్షపాల్ ఆమెను కాపాడాలని ప్రయత్నించాడు. దీంతో అతడు కూడా అలాగే ఇరుక్కున్నాడు. వెంటనే మున్నాకుమార్ చైన్ లాగాడు. దీంతో రైలు ఆగిపోయింది. ఈ ప్రమాదంలో హీరామతి కుడి పాదం తెగిపోయింది. రక్షపాల్ కు తలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. వెంటనే అక్కడి సిబ్బంది వారిద్దరిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
దారుణం..సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదిని హతమార్చిన భర్త, మాజీ ఐఐఎస్ ఆఫీసర్..
కానీ అక్కడికి వెళ్లి, చికిత్స తీసుకునేలోపే రక్షపాల్ పరిస్థితి విషమించడంతో మరణించాడు. హీరామతిని మెరుగైన చికిత్స కోసం కర్నూల్ లోని ఓ హాస్పిటల్ కు తీసుకొని వెళ్లారు. కాగా.. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు., దర్యాప్తు మొదలుపెట్టారు.