అమరావతి: ఈ నెల 30వ తేదీన ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి టీడీపీ ప్రతినిధి బృందం హాజరుకానుంది.ఈ మేరకు టీడీఎల్పీ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నారు.జగన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ టీడీపీ బృందం లేఖను కూడ ఇవ్వనున్నారు.

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ప్రమాణం చేయనున్నారు.  తన ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా వైఎస్ జగన్ ఈ నెల 28వ తేదీన చంద్రబాబునాయుడుకు ఫోన్ చేశారు.

ఆ సమయంలో చంద్రబాబునాయుడు జగన్‌ ఫోన్‌కు స్పందించలేదు. చంద్రబాబునాయుడుకు ఈ సమాచారాన్ని పార్టీ ప్రతినిధులు చేరవేశారు. ఈ విషయమై బుధవారం నాడు జరిగిన టీడీపీ శాసనసభపక్ష సమావేశంలో చర్చ జరిగింది.

ఈ సమావేశంలో జగన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి  హాజరుకావాలని నిర్ణయం తీసుకొన్నారు. జగన్ ప్రమాణస్వీకారోత్సవానికి ప్రతినిధి బృందాన్ని పంపాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఈ ప్రతినిధి బృందంలో ఎవరెవరు ఉంటారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నందున శుభాకాంక్షలు తెలుపుతూ టీడీపీ బృందం ఓ లేఖను కూడ ఇవ్వనున్నారు.మరో వైపు చంద్రబాబునాయుడును టీడీఎల్పీ నేతగా ఎన్నుకొన్నారు. టీడీఎల్పీ ఉపనేత, విప్‌ల నియామకం బాధ్యతను చంద్రబాబుకు అప్పగించారు.

ఏపీ సీఎంగా చంద్రబాబునాయుడు  2014లో ప్రమాణస్వీకారోత్సవం చేసిన సమయంలో  వైసీపీ దూరంగా ఉంది. ఏపీ రాజధాని శంకుస్థాపన సమయంలో కూడ వైసీపీ దూరంగానే ఉంది. అయితే ఆ సమయంలో  వైసీపీ చీఫ్ జగన్ వద్దకు మంత్రుల బృందాన్ని పంపారు. కానీ, ఆ మంత్రుల బృందాన్ని జగన్ కలవలేదు. ఈ విషయంలో ఆ సమయంలో రెండు పార్టీల మధ్య పరస్పరం విమర్శలు చోటు చేసుకొన్నాయి.

కానీ, ఈ దఫా మాత్రం జగన్‌ చంద్రబాబును ఆహ్వానించారు. కానీ, టీడీపీ ప్రతినిధి బృందం మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. చంద్రబాబునాయుడు మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉండే అవకాశం ఉందని సమాచారం.

సంబంధిత వార్తలు

టీడీఎల్పీ నేతగా చంద్రబాబు

ఏపీ అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్‌గా చంద్రబాబు

ఎమ్మెల్యేలు, ఎంపీలతో చంద్రబాబు భేటీ

ఏపీ అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్‌గా చంద్రబాబు
చంద్రబాబు మరో రికార్డు: ప్రతిపక్ష నేతగా దీర్ఘకాలం