అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో టీడీపీ శాసనసభపక్ష నేతగా చంద్రబాబునాయుడు ఎన్నికయ్యారు. అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో  టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఎన్నికయ్యారు.

అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ శాసనసభపక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబునాయుడును ఎన్నుకొన్నారు. టీడీఎల్పీ నేతగా చంద్రబాబునాయుడును పలువురు ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.

ఈ సమావేశానికి హాజరుకాలేనని విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే గణబాబు  సమాచారం ఇచ్చారు.  ఏపీ అసెంబ్లీలో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.అయితే  నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నందున బాబు వైపుకు ఎమ్మెల్యేలు మొగ్గు చూపారు. సంస్థాగతంగా ఉన్న లోపాలను కూడ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని కూడ ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

ఏపీ అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్‌గా చంద్రబాబు

ఎమ్మెల్యేలు, ఎంపీలతో చంద్రబాబు భేటీ

ఏపీ అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్‌గా చంద్రబాబు
చంద్రబాబు మరో రికార్డు: ప్రతిపక్ష నేతగా దీర్ఘకాలం