అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ప్రోటెం స్పీకర్‌గా చంద్రబాబునాయుడుకు అవకాశం దక్కనుంది. అయితే ఈ అవకాశాన్ని చంద్రబాబునాయుడు తీసుకొంటారా... లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పదేళ్ల పాటు విపక్ష నేతగా చంద్రబాబునాయుడు పనిచేశారు. అవశేశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ చంద్రబాబునాయుడు మరో సారి విపక్ష నేతగా పనిచేసేందుకు సిద్దమయ్యారు.

అవశేష ఏపీ అసెంబ్లీ చంద్రబాబునాయుడే అత్యంత సీనియర్‌ ఎమ్మెల్యే. కొత్త ఎమ్మెల్యేలను ప్రమాణం చేయించే బాధ్యత ప్రొటెం స్పీకర్‌ది.అసెంబ్లీలో స్పీకర్‌ స్థానానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఈ స్థానంలో చంద్రబాబునాయుడు ఇప్పటివరకు కూర్చోలేదు. అయితే ప్రొటెం స్పీకర్‌గా చంద్రబాబునాయుడు బాధ్యతలు నిర్వహిస్తే  మరో రికార్డు సృష్టించనున్నారు.

ఒకవేళ ప్రొటెం స్పీకర్‌గా పనిచేసేందుకు చంద్రబాబునాయుడు అంగీకరించకపోతే ఆ తర్వాత సీనియర్‌ గంటా శ్రీనివాస్ రావు మాత్రమే శాసనసభలో ఉన్నారు.గంటా శ్రీనివాసరావు ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

చంద్రబాబు మరో రికార్డు: ప్రతిపక్ష నేతగా దీర్ఘకాలం