అమరావతి:నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలతో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు బుధవారం నాడు ఉండవల్లిలోని తన నివాసంలో సమావేశమయ్యారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు మాత్రమే ఎన్నికయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కూడ చర్చించే అవకాశం ఉంది.

మరో వైపు ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలు కావడంపై కూడ ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. టీడీఎల్పీ నేతగా  చంద్రబాబునాయుడును ఎన్నుకొనే అవకాశం ఉంది. టీడీఎల్పీ ఉప నేతగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఛాన్స్ దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

ఏపీ అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్‌గా చంద్రబాబు
చంద్రబాబు మరో రికార్డు: ప్రతిపక్ష నేతగా దీర్ఘకాలం