తిత్లీ తుఫానుతో తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రప్రభుత్వం అదనపు సాయాన్ని ప్రకటించింది. తుఫాను సాయం కింద రూ. 539.53 కోట్లు అదనంగా ఇవ్వాలన్న ప్రతిపాదనలకు కేంద్ర హోంశాఖ హైలెవల్ కమిటీ గురువారం ఆమోదం తెలిపింది.

అలాగే వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి కూడా రూ.3050 కోట్ల అదనపు సాయాన్ని అందజేయనుంది. అక్టోబర్ నెలలో సంభవించిన తిత్లీ తుఫాన్ ధాటికి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. వేల ఎకరాల్లో వరి, అరటి, కొబ్బరి పంటలు నేలకొరగగా, పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.

‘‘తిత్లీ’’ తుఫాను బాధితులకు అన్నదమ్ముల సాయం

తిత్లీ తుఫాను ఎఫెక్ట్...మహిళా సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు చెట్టుపైనే జాగారం

రెచ్చగొడుతున్నారు, ఊరుకోం: తిత్లీపై చంద్రబాబు ట్వీట్

తుపాన్ లో పుట్టిన పాప.. తిత్లీగా నామకరణం

తెలంగాణపైనా తిత్లీ ఎఫెక్ట్.. నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

తిత్లీ తుఫాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందంటే....

ఏపీకి తిత్లీ ముప్పు: అప్పుడు ఇదే రోజుల్లో హుధూద్