Asianet News TeluguAsianet News Telugu

తుపాన్ లో పుట్టిన పాప.. తిత్లీగా నామకరణం

ఈ నెల 12వతేదీన హోరు గా వీస్తున్న గాలిలో, జోరు వానలో మిడ్నాపూర్ లోని తుపాన్‌గంజ్ ప్రాంతంలోని ఓ నర్సింగ్ హోంలో ఇషితాదాస్(31) అనే ఉపాధ్యాయురాలికి  ఓ బాలిక జన్మించింది. 
 

Rush to name newborn babies after Cyclone Titli in Odisha
Author
Hyderabad, First Published Oct 17, 2018, 9:35 AM IST

ఇటీవల ఉత్తరాంధ్రతోపాటు, ఒడిశా పలు ప్రాంతాల్లో తిత్లీ తుఫాను బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ తుఫానులో చాలా మంది ఆస్తి, ప్రాణాలను కోల్పోయారు. అయితే.. ఓ కుటుంబానికి తీపి గుర్తు మిగిల్చింది. ఈ అరుదైన ఘటన మిడ్నాపూర్ ప్రాంతంలో వెలుగుచూసింది. 

 ‘తిత్లీ’ తుపాన్ ఓడిశా రాష్ట్రంలోని మిడ్నాపూర్ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది.కాని  ఈ నెల 12వతేదీన హోరు గా వీస్తున్న గాలిలో, జోరు వానలో మిడ్నాపూర్ లోని తుపాన్‌గంజ్ ప్రాంతంలోని ఓ నర్సింగ్ హోంలో ఇషితాదాస్(31) అనే ఉపాధ్యాయురాలికి  ఓ బాలిక జన్మించింది. 

ఇండియన్ ఆయిల్ కంపెనీలో ఫీల్డు ఆఫీసరుగా పనిచేస్తున్న ప్రదీప్ టమయ్, ఇషితాదాస్ ల వివాహం 2011లో జరిగింది. ఇషితాదాస్ గర్భం దాల్చాక తుపాన్ లో జోరు వాన కురుస్తుండగానే బాలికకు జన్మనిచ్చింది. భారీ వర్షంతో తుపాన్ ప్రారంభం కావడంతో తాము ఆందోళన చెందామని కాని సుఖ ప్రసవం కావడంతో ఆ పాపకు తిత్లీ గా నామకరణం చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios