ఉత్తరాంధ్రను వణికించిన తిత్లీ తుఫాను ప్రభావం తెలంగాణపైనా పడింది. భీకరంగా వీచిన ఈదురుగాలుల ప్రభావంతో విద్యుత్ టవర్లు కూలిపోవడంతో రాష్ట్రంలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
ఉత్తరాంధ్రను వణికించిన తిత్లీ తుఫాను ప్రభావం తెలంగాణపైనా పడింది. భీకరంగా వీచిన ఈదురుగాలుల ప్రభావంతో విద్యుత్ టవర్లు కూలిపోవడంతో రాష్ట్రంలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
తాల్చేర్-కోలార్, అంగుల్-శ్రీకాకుళం లైన్లు పూర్తిగా దెబ్బతినడంతో తెలంగాణకు 3 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. సరఫాను పునరుద్ధరించేందుకు మూడు రోజులు పట్టే అవకాశం ఉందని ప్రజలు సహకరించాలని జెన్‌కో-ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు కోరారు.
విద్యుత్ సౌధ, ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయాల్లో ఆయన దీనిపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర సంస్థల నుంచి రావాల్సిన విద్యుత్ పూర్తి స్థాయిలో రావడం లేదని.. ఉత్పత్తి తగ్గడమే అందుకు కారణమని ఆయన అన్నారు.. తెలంగాణలోని విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ఆగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎండీ ఆదేశించారు.
తిత్లీ భీభత్సం...కొండచరియలు విరిగిపడి 12మది మృతి
తిత్లీ తుఫాను ఎఫెక్ట్...మహిళా సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు చెట్టుపైనే జాగారం
తిత్లీ తుఫాన్ కు ఆ పేరు ఎలా వచ్చిందంటే....
శ్రీకాకుళంకు చేరుకున్న చంద్రబాబు: తిత్లీ తుఫాన్ పై రివ్యూ
తీవ్రరూపం దాల్చిన తిత్లీ తుఫాన్: వణుకుతున్న ఉత్తరాంధ్ర
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Oct 16, 2018, 9:18 AM IST