ఢిల్లీ: వైఎస్ఆర్సీపీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి కేసులో నిందితుడును అంతమెుందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ నిందితుడు వ్యాఖ్యానించడం చూస్తుంటే నిజంగానే కుట్ర జరుగుతుందన్నారు. 

ఎంతో ఆరోగ్యంగా ఉన్న శ్రీనివాస్ ను ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తుంటే చేతులతో మోసుకు వస్తున్నారని విమర్శించారు. నిందితుడు శ్రీనివాస్ కు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని హెచ్చరించారు. శ్రీనివాస్ కు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అంటూ బొత్స స్పష్టం చేశారు. 

జగన్ పై దాడి ఘటనలో థర్డ్ పార్టీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిందితుడు శ్రీనివాస్ పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉందని బొత్స అభిప్రాయపడ్డారు. శ్రీనివాస్ సజీవంగా ఉంటేనే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని మండిపడ్డారు. 

వైఎస్ఆర్సీపీ తాము మెుదటి నుంచి జగన్ పై దాడి వెనుక చంద్రబాబు నాయుడు, లోకేష్ ల కుట్ర ఉందని ఆరోపించారు. అందువల్లే థర్డ్ పార్టీ విచారణకు రాష్ట్రం మెుగ్గు చూపడం లేదని చెప్పారు. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకుని థర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని కోరారు.  
 
జగన్ పై దాడి కేసులో నిందితుడు, సాక్షి రెండూ శ్రీనివాసేనని మాజీఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. హత్యాయత్నానికి ఎవరి ఉసిగొల్పింది లేదా దాడి వెనుక ఎవరైనా ఉన్నారా అన్న విషయాలు వెలుగులోకి రావాలంటే శ్రీనివాస్ సజీవంగా ఉండాలని అన్నారు. ప్రస్తుతం చూస్తుంటే చంద్రబాబు, లోకేష్ లు హత్యారాజకీయాలకు ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోందన్నారు.

జగన్ పై దాడి ఘటన, రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై బుధవారం రాష్ట్రపతిని కలవనున్నట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను సైతం బుధవారం తమ పార్టీ నేతలు కలవనున్నట్లు స్పష్టం చేశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

జగన్‌పై దాడి కేసు: పచ్చి మంచినీళ్లు కూడ ముట్టని శ్రీనివాస్

జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు: స్వంత పార్టీ నేత కౌంటర్

జగన్‌పై దాడి: స్నేహితులకు భారీ విందిచ్చిన శ్రీనివాస్, యువతితో పార్టీకి

ప్రజల మంచి కోసమే జగన్ పై దాడి చేశా: శ్రీనివాస్ కు అస్వస్థత, కెజీహెచ్ కు తరలింపు

అభిమానంతోనే పిల్లోడు దాడి, జగన్ కు లవ్ లెటర్ రాసిన నిందితుడు: సోమిరెడ్డి

అలిపిరిలో చంద్రబాబుపై దాడి భువనేశ్వరి చేయించారా..:టీడీపీకి వైసీపీ కౌంటర్

ఆపరేషన్ గరుడ: హీరో శివాజీ అమెరికా చెక్కేశాడా...

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. మరో వీడియో విడుదల చేసిన శివాజీ