Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ వల్లే పోలవరం ఆలస్యం, జగన్ రాజ్యాంగాన్ని ఫాలో అవ్వడం లేదు: సుజనా చౌదరి ఫైర్

పోలవరం ప్రాజెక్టులో నెలకొన్న సమస్యలకు దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఆరోపించారు. 2009లో నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును రీ ఓపెనింగ్ చేయడంతోనే సమస్యలు తలెత్తినట్లు చెప్పుకొచ్చారు.

bjp mp sujana chowdary sensational comments on ys jagan
Author
New Delhi, First Published Sep 25, 2019, 4:41 PM IST

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు వై సుజనా చౌదరి. ఏపీలో పరిస్థితి దారుణంగా ఉందని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ లో పారదర్శకత కనిపించడం లేదని తూతూ మంత్రంగానే రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తున్నట్లు ఉందన్నారు. 

ఇటీవల రివర్స్ టెండరింగ్ ద్వారా నిర్వహించిన హైడల్ ప్రాజెక్టు చూస్తుంటే ప్రాజెక్టు మరింత ఆలస్యం అయ్యే పరిస్థితి ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తయ్యే సరికి కనీసం మూడేళ్లు పట్టేయోచ్చన్నారు. 15వేల మెగా వాట్ల విద్యుత్ నష్టం వాటిల్లుతుందని వాటి విలువ 5వేల కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. 

లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి రూ.300 నుంచి 400 కోట్లు అదనపు ఖర్చు అయ్యే అవకాశం ఉందన్నారు. ఇలా చూస్తుంటూ పోతే ప్రాజెక్టు మరింత ఆలస్యం, అధిక ఖర్చు అవ్వడమే తప్ప రివర్స్ టెండరింగ్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  

పోలవరం ప్రాజెక్టులో నెలకొన్న సమస్యలకు దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ఆరోపించారు. 2009లో నాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టును రీ ఓపెనింగ్ చేయడంతోనే సమస్యలు తలెత్తినట్లు చెప్పుకొచ్చారు. రెండు మూడేళ్లలో భూసేకరణ, నిర్వాసితుల సమస్యలను వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు. 

2013 ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అవసరమయ్యే పరిస్థితి ఉండేది కాదన్నారు. ఆనాడు సరిగ్గా తలచుకుని ఉంటే కేవలం రూ.10వేల కోట్లతోనే ప్రాజెక్టు పూర్తి అయ్యేదని సుజనా చౌదరి ఆరోపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు కాలయాపన అవుతూనే ఉందన్నారు. 

పోలవరం ప్రాజెక్టు లెఫ్ మెయిన్ కెనాల్, రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసుకుని గ్రావిటీ ద్వారా నీరందిస్తే రైతులకు ఎంతో ఉపయోగపరంగా ఉంటుందన్నారు. అలా వ్యవహరించకుండా ప్రభుత్వం ఇష్టానుసారం వ్యవహరిస్తోందని సుజనా చౌదరి ఆరోపించారు. 

భారత రాజ్యాంగం ప్రకారం వైసీపీ ప్రభుత్వం నడుచుకోవడం లేదన్నారు. ఎంతో నమ్మకంతో ప్రజలు ఓటేశారని దాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాబోయే రోజుల్లో యువతీ యువకులకు నష్టం చేకూరేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉందన్నారు. కంపెనీలు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు రావడం లేదని ఆరోపించారు. బ్యాంకర్లు సైతం ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు. 

పీపీఏల పున: సమీక్ష వల్ల ఏ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టే పరిస్థితి ఉండదన్నారు. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుంటి పడిపోయిందన్నారు. కొత్త ఇసుక పాలసీ ఎందుకు అమలు చేయడం లేదో కూడా ప్రభుత్వం చెప్పలేకపోతుందని విమర్శించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కోడెల మృతికి ప్రభుత్వమే కారణం: బీజేపీ ఎంపీ సుజనా

మీకంత సీన్ లేదు, మీరు ఎమ్మెల్యే మాత్రమే: చంద్రబాబుపై సుజనాచౌదరి ఫైర్

అమరావతిపై జోక్యం చేసుకోవాలి: గవర్నర్ కు బీజేపీ వినతి

అమరావతిని గోస్ట్ సిటీలా మార్చేశారు, హోదా పెద్ద జోక్: జగన్ 100 రోజుల పాలనపై సుజనా చౌదరి సెటైర్లు

అమరావతిలో భూములు లేవు.. ఆధారాలుంటే కేసులు పెట్టుకోండి: సుజనా చౌదరి

Follow Us:
Download App:
  • android
  • ios