విజయవాడ : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీసీఎం చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సుజనాచౌదరి. మూడేళ్లలో జమిలి ఎన్నికలు వచ్చే  అవకాశముందంటూ చంద్రబాబు నాయుడు ఎలా చెప్తారంటూ ప్రశ్నించారు.  

జమిలి ఎన్నికలపై మాట్లాడే స్థాయిలో చంద్రబాబు లేరంటూ సెటైర్లు వేశారు. ప్రస్తుతం చంద్రబాబు కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని సుజనా చౌదరి తెలిపారు. జమిలి ఎన్నికలపై తనకు సమాచారం లేదన్నారు. 

తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వాలు వహించిన నిర్లక్ష్యమే ట్రాక్ తప్పిందంటూ చెప్పుకొచ్చారు. పోలవరంపై కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని, ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వం కూడా కాలయాపన చేయడంతో ట్రాక్‌ తప్పిందని ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు.

అంతకుముందు రాజధాని ప్రాంత రైతులతో కలిసి గవర్నర్ బీబీ హరిచందన్ ని కలిశారు. రాజధాని పట్ల రైతులు తీవ్ర అందోనలో ఉన్నారని చెప్పుకొచ్చారు. 
ముఖ్యమంత్రి ప్రకటన కోసం రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. 

మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని పై స్టేట్మెంట్ ఇచ్చి నెలరోజులు గడుస్తున్నా ముఖ్యమంత్రి వైయస్ జగన్ దానిపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ అంశాలన్నింటినీ గవర్నర్ బీబీ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ సుజనాచౌదరి తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

చదువుకున్న వాళ్లకే కులపిచ్చి, జమిలి ఎన్నికలకు ఛాన్స్: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు