అమరావతి: రాజధాని మార్పు వ్యవహరంలో జోక్యం చేసుకోవాలని బీజేపీ నేతలు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను బుధవారం నాడు  కలిశారు. రాజధానిని అమరావతిలోనే ఉండేలా చూడాలని కోరారు.

బుధవారం నాడు మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి నేతృత్వంలో బీజేపీ ప్రతినిది బృందం, రాజధాని రైతులు గవర్నర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాజధాని విషయంలో  వైఎస్ఆర్‌సీపీ నేతలు, మంత్రులు తలో రకంగా ప్రకటనలు చేయడాన్ని ఈ సందర్భంగా బీజేపీ నేతలు, రైతులు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు.

రాజధాని రైతులు ఆందోళనగా ఉన్న విషయాన్ని సుజనా చౌదరి ఈ సందర్భంగా గవర్నర్ కు చెప్పారు. ఈ విషయమై గవర్నర్ సానుకూలంగా స్పందించారని బీజేపీ నేతలు చెబుతున్నారు.