జగన్‌తో భేటీ ఎఫెక్ట్: నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి‌పై వేటేసిన బీజేపీ

Bjp expels Nedurumalli ramkumar reddy from Bjp
Highlights

మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తనయుడు  నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డిని బీజేపీ నుండి బహిష్కరించారు. రాం‌మ్‌కుమార్ రెడ్డి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నందున  బీజేపీ ఈ  నిర్ణయాన్ని తీసుకొంది.

నెల్లూరు:మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తనయుడు  నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డిని బీజేపీ నుండి బహిష్కరించారు. రాం‌మ్‌కుమార్ రెడ్డి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నందున  బీజేపీ ఈ  నిర్ణయాన్ని తీసుకొంది.

2014 లో కాంగ్రెస్ పార్టీని వీడి  బీజేపీలో చేరారు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి.  అయితే కొంత కాలంగా రామ్ కుమార్ రెడ్డి బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీలో చేరాలని రామ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. ఈ మేరకు తన అనుచరులతో పలు దఫాలు సమావేశమయ్యారు. వైసీపీలో చేరాలని  తన నిర్ణయాన్ని  అనుచరులతో చర్చించారు. ఈ మేరకు అనుచరులు కూడ ఓకే చెప్పారు.

మరోవైపు  తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్రలో ఉన్న వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ను  రామ్‌కుమార్ రెడ్డి ఇటీవల కలిశారు. వైసీపీలో చేరే విషయమై  జగన్ తో చర్చించారు. పార్టీలో చేరే విషయమై జగన్ కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దరిమిలా వైసీపీలో చేరే విషయాన్ని  రామ్ కుమార్ రెడ్డి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

అయితే ఈ పరిణామాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని బీజేపీ నుండి నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డిని పార్టీ నుండి బహిష్కరిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు  కన్నా లక్ష్మీనారాయణ ఈ మేరకు  ఓ ప్రకటనను విడుదల చేశారు. 

 

ఈ వార్తలు చదవండి: వైసీపీలోకి మాజీ సీఎం కుమారుడు

                                     బీజేపీకి షాక్: జగన్‌తో నేదురుమల్లి భేటీ, కమలానికి గుడ్‌బై?


 

loader