వైసీపీలోకి మాజీ సీఎం కుమారుడు

ex cm son nedurumalli ramkumar reddy joins in ycp
Highlights

ఇప్పటికే ఆయన అభిమానులు వైసీపీలోకి రావాలని ఒత్తిడి తెచ్చారు. కార్యకర్తల అభీష్టం మేరకే నడుచుకుంటానని ఆయన తెలిపారు. గురవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన కార్యకర్తలకు తెలిపారు.
 
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్థన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరారు. మొన్నటి వరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించిన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గురువారం వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు ప్రకటించారు.

రం క్రితం నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతున్న ప్రజాసంకల్ప యాత్రకు వెళ్లి పార్టీ అధినేత, శాసనసభా ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు.

ఈ పరిణమాల నేపథ్యంలో జిల్లాలోని నేదురుమల్లి అభిమానులు, ముఖ్య అనుచరులతో నేదురుమల్లి ఆత్మీయ సమావేశాన్ని నగరంలోని స్వర్ణముఖి అతిథి గృహంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అనుచరులు తమ అభిప్రాయాలను వివరించారు. రాజకీయ భవిష్యత్తు కార్యాచరణపై పాల్గొన్న వారందరూ అభిప్రాయాలను వెల్లడించారు. 

loader