ఏపీలో బీజేపీకి  మరో షాక్  తగిలేలా ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నేదురుమల్లి రాం‌మ్ కుమార్ రెడ్డి శనివారం రాత్రి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు  తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో  కలిశారు

ఏపీలో బీజేపీకి మరో షాక్ తగిలేలా ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నేదురుమల్లి రాం‌మ్ కుమార్ రెడ్డి శనివారం రాత్రి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో కలిశారు.రామ్‌కుమార్ రెడ్డి బీజేపీని వదిలి వైసీపీలో చేరే అవకాశం ఉందని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. అయితే ఆయన జగన్‌ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

నెల్లూరు జిల్లాకు చెందిన రామ్‌కుమార్ రెడ్డి మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తనయుడు. గత ఎన్నికల సమయంలో ఆయన బీజేపీలో చేరారు. అయితే చాలా కాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే వైసీపీలో చేరాలని రామ్ కుమార్ రెడ్డి సన్నాహాలు చేసుకొంటున్నారు.ఈ తరుణంలోనే ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ను రామ్ కుమార్ రెడ్డి కలిశారు. 

నెల్లూరు జిల్లా వెంకటగిరి టిక్కెట్టును రామ్ కుమార్ రెడ్డి ఆశిస్తున్నారు. తాజాగా బీజేపీ ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గంలో రామ్‌కుమార్ రెడ్డికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలను అప్పగించింది. అయితే రామ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరేందుకే మొగ్గు చూపుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.

ఈ కారణంగానే రామ్ కుమార్ రెడ్డి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ తో సమావేశమయ్యారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.వచ్చే ఎన్నికల్లో వెంకటగిరి నుండి పోటీ చేయాలని రామ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారు. అయితే వెంకటగిరి నుండి టిక్కెట్టు ఇచ్చే విషయమై జగన్ రామ్ కుమార్ రెడ్డికి హమీ ఇచ్చారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఆనం రామనారాయణరెడ్డి కూడ త్వరలో వైసీపీలో చేరనున్నారు. అయితే వెంకటగిరి టిక్కెట్టు విషయమై రామ్ కుమార్ రెడ్డికి హామీ లభించకున్నా ఆయన వైసీపీలో చేరుతారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.