బిజెపి నాయత్వంలోని ప్రభుత్వం పెళ్లిళ్ల సీజన్లో  కొన్ని వేల కుటుంబాలకు డబ్బుఅందకుండా , పెళ్లిళ్లు వాయిదా పడేలా ఎలా చేయగలిగింది? దేశాన్ని పాలిస్తున్న బిజెపినేతలకు ఈ చిన్నవిషయం గుర్తురాలేదా?  కారణమేమయి ఉంటుంది.

 

దీనికి సమాధానం బాబా రామ్ దేవ్  చురకేసి చెప్పారు.

 

ఇలాంటి పనికిమాలిన పని ఎలా చేయగలిగారంటే,  పెళ్లికష్టాలనేవి  బిజెపిలో ఉన్న చాలామందికి తెలియవు. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్న చాలా మందినేతలకు పెళ్లే కాలేదుగా అని బాబా రామ్ దేవ్ చమత్కరించారు.

 

ఎవరో గాలి జనార్దన్ రెడ్డి వంటి పెద్దమనుషుల్ని వదిలేస్తే మోదీ తీసిన దెబ్బకి ఈ సీజన్ లో పెళ్లి ఖారా రు చేసుకున్న వారందిరికి దిమ్మ తిరిగిపోయింది. ఇది మొత్తం భారత దేశమంతా పెళ్లిళ్ల సీజన్.  ఇపుడు ప్రభుత్వం విధించిన పరిమితి ప్రకారం పెళ్లింటికి  రు. 2.5ల క్షలు మాత్రమే  విత్ డ్రా చేసుకోవచ్చు.దీనికి పెళ్లి కార్డుతో పాటు అధార్ కార్డ్ కూడా చూపిస్తే బ్యాంకులు ఈ డబ్బును మన అకౌంట్ నుంచి విత్ డ్రా చేసుకునేందుకు అనుమతిస్తాయి. రెండున్నర లక్షలకు భారత దేశంలో పెళ్లి జరిగే రోజు పోయి దశాబ్దాలయిపోయింది.

 

పెళ్లి కాని వారికి పెళ్లిళ్ల సీజన్ గురించి , పెళ్లి ఖర్చుల గురించి ఎలా తెలుస్తుందని ఆయన ఛలోక్తి విసిరారు.

 

నోట్ల రద్దు నిర్ణయాన్ని ఒక నెలా పదిహేను రోజుల  తరువాత తీసుకొని ఉంటే పెళ్లిళ్ల మీద దీని ప్రభావం పడి ఉండేది కాదని ఆయన అన్నారు.

 

పోనీలే, ఈ  నిర్ణయం వల్ల ఒక మంచి కూడా జరిగింది, చాలామంది కట్నం అడగటం లేదట  అని కూడా ఆయన అన్నారు.