వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన దాడిపై వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. తమ అధినేతకు ఏం జరిగిందోనన్న ఆందోళనలో వారంతా ఉన్నారు.

దాడి విషయం తెలియగానే విశాఖ ఎయిర్‌పోర్టుకు భారీగా చేరుకున్న వైసీపీ కార్యకర్తలు, నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మరికాసేపట్లో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను కలవనున్నారు.

దాడి వెనుక దాగివున్న కుట్రను బయలకు తీయడంతో పాటు దీని వెనుకున్న వ్యక్తులను పట్టుకోవాల్సిందిగా వారు కోరనున్నారు. మరోవైపు జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండించిన ఆ పార్టీ మహిళా నేత రోజా ప్రభుత్వంపై నిప్పులు చేరిగారు. దాడికి ఉపయోగించని కత్తికి విషం పూశారేమోనని ఆమె అభిప్రాయపడ్డారు. 

జగన్‌పై జరిగిన దాడిపై అనుమానాలు...జ్యుడిషియల్ ఎంక్వయిరీ చేయాలి: జీవిఎల్

నిందితుడు జగన్ అభిమాని.. పబ్లిసిటీ కోసమే దాడి: ఏపీ డీజీపీ

విశాఖ ఎయిర్ పోర్టును చుట్టుముట్టిన వైసీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

జగన్ పై కత్తితో దాడి కుట్రేనా....నిందితుడి జేబులో లేఖ

వైఎస్ జగన్‌పై దాడి: ఖండించిన మంత్రి జవహర్

జగన్ పై దాడి... గంటలో నిజాలు తేలుస్తాం.. చినరాజప్ప