ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పై ఇవాళ ఓ వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. విశాఖ ఎయిర్ పోర్టు నుండి హైదరాబాద్ కు బయలుదేరిన క్రమంలో ఆయనపై కత్తితో దాడి జరిగింది. సెల్ఫీ తీసుకుంటానంటూ జగన్‌ వద్దకు వచ్చిన దుండగుడు కోడి పందెలలో ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. దీంతో జగన్ భుజంపై తీవ్ర గాయమైంది. 

ఈ ఘటన ఏపిరాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. పార్టీలకు అతీతంగా నాయకులు ఈ దాడిని ఖండిస్తున్నారు. ఈ దాడిపై బిజెపి రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నర్సింహరావు స్పందించారు. ప్రతిపక్ష నాయకుడిపై జరిగిన దాడి అమానుషమైనదని జీవిఎల్ పేర్కొన్నారు. దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించిన అతడు అన్ని పార్టీలు కూడా ముక్తకంఠంతో ఖండించాలని సూచించారు.

 అత్యంత భద్రత, సురక్షితంగా భావించే ఎయిర్‌పోర్టులో దాడి జరగడం ఫలు అనుమానాలను రేకిత్తిస్తోందని జీవిఎల్ అన్నారు. అందువల్ల ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే  జ్యూడిషయల్ ఎంక్వయిరీకి ఆదేశించాలని కోరారు. ఈ దాడికి పాల్పడిన ముద్దాయితో పాటు ఇందులో పాత్ర వున్న ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని నర్సింహరావు సూచించారు. 

 

సంబంధిత వార్తలు

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు