వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై దాడికి నిరసనగా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన పై దాడిచేసిన వారిని శిక్షించాలంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు.

దాడి విషయం తెలుసుకున్న వెంటనే... అభిమానులు, కార్యకర్తలు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సెక్యురిటీ సిబ్బందిని తోసుకుంటూ మరి కార్యకర్తలు లోపలికి వెళుతున్నారు. ఎయిర్ పోర్టు మొత్తాన్ని కార్యకర్తలు చుట్టుముట్టారు. దీంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

గురువారం ఉదయం విశాఖ ఎయిర్ పోర్టు లాంజ్ లో కూర్చొని ఉండగా దుండగుడు దాడి చేశాడు. సెల్ఫీ తీసుకుంటానంటూ వచ్చిన దుండగుడు కోడి పందేలకు ఉపయోగించే కత్తితో జగన్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో వైఎస్‌ జగన్‌ భుజానికి గాయమైంది. దాడి చేసిన వ్యక్తిని ఎయిర్‌పోర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్‌ శ్రీనివాస్‌గా గుర్తించారు. లాంజ్‌లో వెయిట్ చేస్తున్న జగన్‌కు టీ ఇచ్చిన శ్రీనివాస్.. ‘‘సార్ 160 సీట్లు వస్తాయా’’ అంటూ పలకరించాడు. అనంతరం సెల్ఫీ దిగుతానంటూ దాడికి పాల్పడ్డాడు. దాడి జరిగిన వెంటనే దుండగుడిని సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

read more news

హైదరాబాద్ చేరుకున్న జగన్.. ఎయిర్ పోర్ట్ కి అభిమానులు

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు