విశాఖపట్నం: వైఎస్ఆర్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కత్తితో దాడి కుట్రలో భాగంగానే జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కుట్రలో టీడీపీకి చెందిన ఓ కీలక నేత హస్తం ఉన్నట్లు  ప్రచారం జరుగుతుంది. 

అయితే శ్రీనివాస్ నెల రోజుల క్రితమే క్యాంటీన్ లోవెయిటర్ గా చేరినట్లు తెలుస్తోంది. గతంలో వైజాగ్ లో గాజువాక టీడీపీ టిక్కెట్ కు ప్రయత్నించిన ఓ కీలక నేత ప్రమేయం ఉందన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. వెయిటర్ శ్రీనివాసరావు కూడా ఆ టీడీపీ నేత చెప్తేనే ఎయిర్ పోర్ట్ క్యాంటీన్ లో చేరినట్లు తెలుస్తోంది. 

ఇకపోతే పక్కా ప్లాన్ కాకపోతే భారీ భద్రత నడుమ ఎయిర్ పోర్ట్ లోకి కత్తి ఎలా తీసుకు వెళ్తారని ప్రశ్నలు వెలువడుతున్నాయి. క్యాంటీన్ నిర్వహణలో కూరగాయలు కత్తిరించేందుకు  చాకులు వినియోగిస్తారు. కానీ కోడిపందాలు నిర్వహించే కత్తి ఎందుకు తీసుకువచ్చారు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

ఇకపోతే టీ తీసుకెళ్లిన వెయిటర్ శ్రీనివాసరావు జగన్ పై కత్తితో దాడి చేసే అంత కక్ష ఏం ఉంటుందని సందేహం నెలకొంది. జగన్ కు టీ అతనే తీసుకెళ్లడం...ఆసమయంలోనే కత్తితో దాడి చెయ్యడం అంటే ప్రీ ప్లాన్ డ్ గా ఉన్నాడా అన్న కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు నిందితుడు శ్రీనివాసరావు జేబులో ఒక లెటర్ ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఆ లేఖను కూడా ఎయిర్ పోర్ట్ భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకుందని తెలుస్తోంది. నిందితుడు పబ్లిసిటీ కోసం దాడి చేశాడా లేక దాడి వెనుక ఎవరెవరైనా ఉన్నారా అన్నవిషయం తెలియాలంటే ఆ లేఖలో ఏముందో అన్నది తెలియాల్సి ఉంది. 
 

ఈ వార్తలు కూడా చదవండి

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు