వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన దాడిని మంత్రి జవహర్ ఖండించారు. దాడి గురించి మీడియా ద్వారా తెలుసుకున్న ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివికావన్నారు..

అత్యంత భద్రత కలిగిన విమానాశ్రయంలో పెన్నును కూడా తనిఖీ చేస్తారని.. అలాంటిది ఏకంగా కత్తి లోపలికి ఎలా వెళ్లిందని జవహర్ ప్రశ్నించారు. కేంద్ర బలగాల ఆధీనంలో ఉండే విశాఖ విమానాశ్రయంలో.. దాడి ఎందుకు జరిగిందో విచారణలో నిజాలు తెలుస్తాయన్నారు.

294వ రోజు పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ విమానాశ్రయానికి వచ్చిన వైఎస్ జగన్‌..వీఐపీ లాంజ్‌లో కూర్చొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ అనే వెయిటర్ సెల్ఫీ తీసుకుంటానని చెప్పి జగన్ వద్దకు వచ్చి.. దాడి చేశాడు.

వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. దాడిలో జగన్ ఎడమ భుజానికి గాయమైంది. ప్రాథమిక చికిత్స అనంతరం ప్రతిపక్షనేత హైదరాబాద్ బయలుదేరారు.

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు