వైఎస్ జగన్‌పై విశాఖలో జరిగిన దాడిని ఖండించారు ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్. మీడియాతో మాట్లాడిన ఆయన నిందితుడు శ్రీనివాస్ వైఎస్ జగన్‌కు వీరాభిమాని అని.. పబ్లిసిటీ కోసమే దాడికి పాల్పడ్డాడని అన్నారు.. దాడి ఘటనపై దర్యాప్తు  చేస్తున్నామన్నారు.

ఎస్ఎస్ఎఫ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని డీజీపీ తెలిపారు. నిందితుడి జేబులో ఓ లేఖ ఉందని.. దీనిపై విచారిస్తున్నామన్నారు.  ఎయిర్‌పోర్ట్‌లోకి కత్తి ఎలా వెళ్లిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని.. అయితే విమానాశ్రయ భద్రత సీఐఎస్ఎఫ్‌దేనని ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. 

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

జగన్ కోసం.. ఎయిర్ పోర్ట్ కి డాక్టర్ల బృందం

జగన్ పై దాడి: శ్రీనివాస్ ఎవరు..? ఎయిర్ పోర్టులోకి కత్తి ఎలా వచ్చింది

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

జగన్ పై కత్తితో దాడి కుట్రేనా....నిందితుడి జేబులో లేఖ