ఈ దాడి చేసిన వ్యక్తి వెనుక ఎవరు ఉన్నారో.. గంటలో నిజానిజాలు బయటపెడతామని హామీ ఇచ్చారు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గురువారం విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడిని ఏపీ హోం మంత్రి చినరాజప్ప ఖండించారు. దాడి జరిగిన విషయం తెలుసుకున్న ఆయన వెంటనే ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు.

నిందితుడు దగ్గరకి అసలు కత్తి ఎలా వచ్చిందనే అనుమానాన్ని చినరాజప్ప వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకూడదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ దాడి చేసిన వ్యక్తి వెనుక ఎవరు ఉన్నారో.. గంటలో నిజానిజాలు బయటపెడతామని హామీ ఇచ్చారు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఎయిర్ పోర్టు సెక్యురీటీ తమ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదని.. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందని ఈ సందర్భంగా చినరాజప్ప గుర్తు చేశారు. నిందితుడు ఎంత అక్కడ పనిచేసే సిబ్బంది అయినా.. కత్తిని అనుమతించరు కదా అని అనుమానం వ్యక్తం చేశారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. 

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు