వైసీపీ  అధినేత జగన్మోహన్ రెడ్డి పై విశాఖలో జరిగిన దాడి పలు అనుమానాలకు దారితీస్తోంది. 

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై విశాఖలో జరిగిన దాడి పలు అనుమానాలకు దారితీస్తోంది. నిందితుడు ఉపయోగించిన కత్తి.. దాడి తర్వాత సుమారు గంటసేపు అక్కడ కనిపించలేదు. గురువారం మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో క్యాంటిన్‌లో పనిచేసే శ్రీనివాసరావు కత్తితో జగన్‌ ఎడమ భుజంపై పొడిచాడు. అక్కడున్న పార్టీ నేతలు, జగన్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బంది.. అతడి చేతిలోని కత్తిని లాక్కొన్నారు. నిందితుడిని సీఐఎస్ఎఫ్‌ అధికారులకు అప్పగించారు. గంట తర్వాత సీఐఎస్ఎఫ్‌ అధికారులు వచ్చి.. దాడికి వినియోగించిన కత్తి ఇవ్వాలని కోరారు.

నేతలు కొంతసేపటి తర్వాత ఆ కత్తిని సీఐఎస్ఎఫ్‌ అధికారులకు అందజేశారు. దీంతో ఘటన జరిగిన తర్వాత సుమారు గంటసేపు కత్తి ఏమైందనేది చర్చనీయాంశంగా మారింది. ఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్న పార్టీ నేతలు మళ్ల విజయ్‌ప్రసాద్‌, మజ్జి శ్రీనివాసరావు (బొత్స మేనల్లుడు) కలిసి ఆ కత్తిని స్వాధీనం చేసుకొన్నట్లు తెలిసింది. దానికి ఏమైనా విషం పూశారేమోననే అనుమానంతో నగరంలోని ఒక డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కు పంపించి పరీక్ష చేయించి, తిరిగి ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చినట్టు సమాచారం.

read more news

జగన్నాటకం రక్తికట్టలేదు, రాష్ట్రపతి పాలనకు కుట్ర:గంటా

నేను చెప్పాలనుకున్నదే లేఖలో రాశా...అది చూసుకోండి: నిందితుడు శ్రీనివాస్

కోర్టుకు శ్రీనివాస్, 9ఫోన్ లు ఒకే సిమ్, మరోకత్తి స్వాధీనం :జగన్ కేసుపై విశాఖ సీపీ లడ్డా

పవన్ కళ్యాణ్ పై దాడికి కుట్ర:కన్నా సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

జగన్ "కేంద్రం"గా చంద్రబాబు రాజకీయం

ఆపరేషన్ గరుడ నమ్మాల్సి వస్తే శివాజీని ప్రశ్నించండి:టీడీపీకి రోజా కౌంటర్

జగన్ పై దాడి: లేఖ మడతలు పడలేదు, ఒక్కో పేజీలో ఒక్కో రాత