వైఎస్సార్ సిపి అదినేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి అత్యత అమానుష ఘటనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఆయనపై జరిగిన హత్యాయత్నంపై పలువురు కాంగ్రెస్ నాయకులు స్పందించారు. 

జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై సమగ్ర విచారణ జరిపించాలని ఏపిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే విమానాశ్రయంలో దాడి జరగడం ఫలు అనుమానాలను రేకిత్తిస్తోందని పేర్కొన్నారు. ఈ ఘటన నిఘా వైఫల్యం వల్లే జరిగిందని అన్నారు. ఈ  దాడి  వెనక కుట్రలేమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారణ చేపట్టాలని రఘువీరా సూచించారు.

జగన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏఐసిసి కార్యదర్శి ఉమెన్ చాందీ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దాడిపై విచారణ జరిపి నిజానిజాలను బైటపెట్టాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఈ దాడిని తీవ్రంగా కండిస్తున్నట్లు తెలిపారు. జగన్‌ కు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ఆయన కోరారు.

 జగన్ పై జరిగిన దాడిపై మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు , ప్రస్తుత కాంగ్రెస్ ఎంపి కేవీపి రామచంద్రారావు స్పందిచారు. జగన్ పై  ఇలా హత్యాయత్నం జరగడం దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని....దాడితో సంబంధమున్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేవీపి డిమాండ్ చేశారు. ఇందులో ఏమైనా కుట్రలు దాగివున్నాయేమో గుర్తించడానికి లోతుగా విచారణ జరపాలని సూచించారు. 

  
మరిన్ని వార్తలు

పాపులారిటీ కోసమే జగన్‌పై దాడి: విశాఖ పోలీసులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు జగన్: పోలీసుల అదుపులో అనుమానితుడు

జగన్ ఫ్లెక్సీ కట్టాడు, మంచోడు: శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు

జగన్‌పై వెయిటర్ దాడి: స్పందించిన రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్

వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు