Asianet News TeluguAsianet News Telugu

బోటు మునక: మృతులకు పది లక్షలు ఎక్స్‌గ్రేషియా

దేవీపట్నం బోటు ప్రమాదంలో మరణించిన వారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఘటనపై ఆయన ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష జరుపుతున్నారు. 

ap cm ys jagan announces Rs 5 lakh ex-gratia to the kin of the deceased in the boat mishap
Author
Amaravathi, First Published Sep 15, 2019, 5:15 PM IST

దేవీపట్నం బోటు ప్రమాదంలో మరణించిన వారికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఘటనపై ఆయన ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష జరుపుతున్నారు.

బోటు మునిగిపోయిందనే విషయం తెలిసిన వెంటనే సీఎం జగన్ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌తో పోన్‌లో మాట్లాడారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను వినియోగించాలని సీఎం ఆదేశించారు.

నేవీ, ఓఎన్జీసీ హెలికాప్టర్లను సహాయ చర్యల్లో వినియోగించాలని సీఎం జగన్ కలెక్టర్ కు సూచించారు. మరో వైపు ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా అందుబాటులో ఉన్న  మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఘటనపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని అధికారులకు సీఎం కోరారు. తక్షణమే అన్ని బోటు సర్వీసులను సస్పెండ్‌చేయాలని సీఎం కోరారు.

బోట్లు నడిపే వారి లైసెన్సులు లైసెన్స్‌లు పరిశీలించాలని , బోట్లను నడిపేవారు, అందులో పనిచేస్తున్నవారికి తగిన శిక్షణ, నైపుణ్యం ఉందా? లేదా తనిఖీచేయాలని సీఎం ఆదేశించారు.  నిపుణులతో పటిష్టమైన మార్గదర్శకాలు తయారుచేసి నివేదిక ఇవ్వాలని సీఎం కోరారు.

బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి

బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు

బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం

 

Follow Us:
Download App:
  • android
  • ios