న్యూఢిల్లీ: జాతీయ రాజకీయాలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ యేతర కూటమికి 22 పార్టీలను ఏకం చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. యూపీఏ కూటమికి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ నేరుగా రంగంలోకి దిగారంటూ వార్తలు వస్తున్నాయి. 

సోనియాగాంధీ తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ లను యూపీఏ కూటమికి మద్దతు పలకాలంటూ కోరారని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ పిలుపు చంద్రబాబు అందిందా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా చిరునవ్వుతో సమాధానం చెప్పారు. 

అన్నింటికి సమాధానం చెప్తానని ఇక్కడే ఉంటారు కదా అని చెప్పుకొచ్చారు. యూపీఏ కూటమి అజెండాపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. చివరి దశ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నేతలంతా బిజీబిజీగా గడుపుతున్నారని ఎన్నికల అనంతరం అంతా కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటామని స్పష్టం చేశారు. 

అనంతరం రాజకీయ అజెండా రూపొందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీయేతర కూటమిలో టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తారా అంటే మరీ ఊహాత్మక ప్రశ్నలు వద్దన్నారు. బీజేపీయేతర కూటమికి ఎవరు కలిసి వచ్చినా స్వాగతిస్తామని స్పష్టం చేశారు. అది ఆ పార్టీ ఈ పార్టీ అంటూ ఏమీ ఉండదన్నారు. ఒక పార్టీపై వివక్ష చూపించాల్సిన అవసరం తమకు లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

చదువుకోలేదా, పెత్తనం ఉందని ఇష్టం వచ్చినట్లు చేస్తావా: ద్వివేదిపై చంద్రబాబు ఫైర్

మా ఫిర్యాదులు పట్టించుకోరా, జాతిపితను తిట్టినా స్పదించరా: ఈసీపై చంద్రబాబు గరంగరం

హస్తినకు చేరిన రీపోలింగ్ వ్యహారం: సిఈసీకి చంద్రబాబు ఫిర్యాదు