ఢిల్లీ: ఏపీ ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. లేని అధికారాలను అమలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ హద్దుల్లో ఉండాలంటూ విరుచుకుపడ్డారు చంద్రబాబు నాయుడు. 

మే23 వరకు మాత్రమే అధికారాలు ఉంటాయని ఆ తర్వాత మరో రెండు రోజులపాటు ఈసీకి అధికారాలు ఉంటాయన్నారు. ఆ తర్వాత ఎవరైనా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. ఎలక్షన్ కమిషన్ హద్దుల్లో ఉండాలని హెచ్చరించారు. 

చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ బూత్ లలో జరిగిన రిగ్గింగ్ పైనే మీ కళ్లు ఉన్నాయా మిగిలిన చోట్ల మీ కళ్లు వెళ్లలేదా అంటూ నిలదీశారు. సిఈవోకు వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు మాత్రమే చూస్తారా వేరేది చూడరా అంటూ విరుచుకుపడ్డారు. చదువుకున్నారా, అసలు ఎన్నికల కమిషన్ రూల్స్ తెలుసా అంటూ మండిపడ్డారు చంద్రబాబు.  

సీసీ ఫుటేజ్ తమ వద్ద ఉందంటూ సీఈవో చెప్తున్నారని అయితే తాము ఇచ్చిన ఫిర్యాదులు గురించి పట్టించుకోవడం లేదన్నారు. 19 చోట్ల రిగ్గింగ్ జరిగిందని తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పెత్తనం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు చెయ్యడం సరికాదన్నారు. పులివెందులలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయా అని చంద్రబాబు నిలదీశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

మా ఫిర్యాదులు పట్టించుకోరా, జాతిపితను తిట్టినా స్పదించరా: ఈసీపై చంద్రబాబు గరంగరం

హస్తినకు చేరిన రీపోలింగ్ వ్యహారం: సిఈసీకి చంద్రబాబు ఫిర్యాదు