ఢిల్లీ: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రీపోలింగ్ అంశం ఢిల్లీకి చేరింది. ఎన్నికలు ముగిసి 40 రోజులైన తర్వాత రీ పోలింగ్ ఏంటంటూ టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలు నిరసనకు సైతం దిగారు. 

టీడీపీకి చెందిన కీలక నేతలు సిఈసీని, సిఈవోను కలిశారు. తాజాగా కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాను సీఎం చంద్రబాబు నాయుడు కలిశారు. చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్ కు సంబంధించి పలు అంశాలపై ఆరా తీశారు. 

40 రోజులు ముగిసిన తర్వాత ఎన్నికలు రీ పోలింగ్ ఏంటంటూ ప్రశ్నించారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వెళ్తోందని చంద్రబాబు ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటుందని కానీ టీడీపీ ఫిర్యాదులను మాత్రం పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఫిర్యాదులో పేర్కొన్నారు.