9 ఏళ్ల బాలికపై 90 ఏళ్ల వృద్ధుడి అఘాయిత్యం: ఆందోళన

9 ఏళ్ల బాలికపై 90 ఏళ్ల వృద్ధుడి అఘాయిత్యం: ఆందోళన

గుంటూరు: మైనర్ బాలికలపై అత్యాచారం చేసినవారికి మరణదండన విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్జినెన్స్ తెచ్చినా అఘాయిత్యాలు ఆగడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఓ వృద్ధుడు చిన్నారి పాపపై అత్యాచారం చేశాడు.

సుబ్బయ్య అనే 90 ఏళ్ల వ్యక్తి 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు బుధవారం అర్థరాత్రి ఆందోళనకు దిగారు. 

జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. మధ్యాహ్నంలోగా నిందితుడని అరెస్టు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. దాంతో బాధితులు వెనక్కి తగ్గారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా గ్రామంలో పోలీసు బలగాలను మోహరించారు. 

జిల్లా ఎస్పీ కూడా దాచేపల్లికి చేరుకున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సుబ్బయ్య సెల్ ఫోన్ వాడుతున్నాడని తెలిసి ట్రాక్ చేసే ప్రయత్నం చేశారు. అయితే, దాన్ని గ్రహించి అతను సెల్ ఫోన్ ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది. 

ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అసిఫా సంఘటనను మరిచిపోక ముందే దాచేపల్లిలో ఈ ఘటన జరిగింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos