రూ.17 లక్షలు ఇస్తామని బోటు ప్రమాద ఫ్యామిలీకి బురిడీ

By narsimha lode  |  First Published Sep 24, 2019, 6:36 PM IST

బోటు ప్రమాదంలో బాధిత కుటుంబాన్ని ఓ గుర్తు తెలియని వ్యక్తి మోసం చేశాడు. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకొంది.


విశాఖపట్టణం: ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఫోన్  చేస్తున్నానని చెప్పి బోటు ప్రమాద బాధితుల నుండి డబ్బులను కొట్టేశాడు ఓ వ్యక్తి. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకొంది.

ఈ నెల 15వ తేదీన తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం-కచ్చలూరు మధ్యలో బోటు మునిగిపోయింది. ఈ ఘటనలో విశాఖ జిల్లాలోని ముత్యమాంబ కాలనీకి చెందిన తల్లీ కూతుళ్లు బొండా లక్ష్మి, పుష్ప మృతి చెందారు.

Latest Videos

undefined

విశాఖ జీవీఎంసీ జోనల్ కమిషనర్ కు శనివారం నాడు ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను అమరావతి సచివాలయం నుండి ఫోన్ చేస్తున్నానని పరిచయం చేసుకొన్నాడు. అంతేకాదు విశాఖ జిల్లాలో బోటు ప్రమాద బాధితుల వివరాలు ఇవ్వాలని కోరాడు. దీంతో బొండా లక్ష్మి భర్త శంకర్ పోన్ నెంబర్ ను అతను ఇచ్చాడు.

ఓ వ్యక్తి శంకర్ కు 7989097075 అనే నెంబర్ ద్వారా ఫోన్ చేశాడు. తాను సచివాలయం నుండి ఫోన్ చేస్తున్నట్టుగా పరిచయం చేసుకొన్నాడు. బోటు ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రభుత్వం రూ. 17 లక్షలు  చెల్లించనుందని నమ్మించాడు. శంకర్ బ్యాంకు ఖాతా వివరాలను తీసుకొన్నాడు. 

రూ.7200 రూపాయలను తన ఖాతాలో వేయాలని సూచించాడు. దీంతో శంకర్ వేపగుంట ఎస్‌బీఐలో అకౌంట్‌ నంబరు 36321029951లో నగదు డిపాజిట్‌ చేశాడు.

అనంతరం తనకు కాల్‌ వచ్చిన నంబరుకు ఫోన్‌ చేయగా పనిచేయలేదు. అనంతరం రెవెన్యూ అధికారులను సంప్రతిస్తే తమకు తెలియదని చెప్పడంతో మోసపోయినట్టు గుర్తించిన శంకర్  రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు.

సంబంధిత వార్తలు


బోటు టీడీపీ నేతదే, అందులో చంద్రబాబు కూడా ప్రయాణించారు: మంత్రి అవంతి శ్రీనివాస్

గోదావరిలో బోటు ప్రమాదం: మరో మృతదేహం లభ్యం

మంత్రి అవంతి శ్రీనివాస్ తాగి మాట్లాడుతున్నారా..?: బోటు ప్రమాదంపై హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు

బోటు ప్రమాదంపై హర్షకుమార్ వ్యాఖ్యలు: ఖండించిన అవంతి, తూగో.జిల్లా ఎస్పీ

హర్షకుమార్ సంచలనం: మంత్రి అవంతి మెడకు చుట్టుకున్న బోటు ప్రమాదం ఉచ్చు

బోటు ప్రమాదం ఇలా జరిగింది: ప్రత్యక్ష సాక్షి మధులత

బోటు మునక: రెడ్ సిగ్నల్ చూపినా పట్టించుకోని డ్రైవర్

బోటు మునక: దొరకని ఆచూకీ, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

మన అలసత్వం కారణంగానే ఇంత ఘోరం : బోటు ప్రమాదంపై జగన్ ఆవేదన, అధికారులపై ఆగ్రహం

గోదావరిలో బోటు మునక... ప్రమాద ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే (ఫోటోలు)

బోటు యజమానిపై కేసు నమోదు చేశాం: మంత్రి ఆళ్ల నాని

బోటు ప్రమాదం...మరో నాలుగు మృతదేహాలు లభ్యం

మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

అంతులేని విషాదం: ఒకే కుటుంబంలో 12 మంది గల్లంతు

డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్

click me!