విశాఖలో స్పా ముసుగులో చీకటి దందా
Visakhapatnam : విశాఖపట్నంలో స్పా ముసుగులో నడుస్తున్న ప్రాస్టిట్యూషన్ దందా బయటపడింది. ఆర్చిడ్ వెల్‌నెస్ స్పా సెంటర్ (Orchid Wellness & Spa Centre) పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు.

వైజాగ్ లో స్పా ముసుగులో ప్రాస్టిట్యూషన్
Visakhapatnam Prostitution racket: విశాఖపట్నంలో స్పా సెంటర్ల పేరుతో జరుగుతున్న అనైతిక కార్యకలాపాలు మళ్లీ వెలుగుచూశాయి. అధికారికంగా రిలాక్సేషన్, థెరపీ, బాడీ వెల్‌నెస్ పేరుతో నడుస్తున్న కొన్ని కేంద్రాలు వాస్తవానికి ప్రాస్టిట్యూషన్ దందా కేంద్రాలుగా మారిపోయాయని టాస్క్‌ఫోర్స్ తనిఖీల్లో బయటపడింది. తాజాగా నగరంలోని వి.ఐ.పీ రోడ్ సమీపంలోని ఆర్చిడ్ వెల్‌నెస్, స్పా సెంటర్ పై పోలీసులు దాడి చేయడంలో ఈ యవ్వారం వెలుగులోకి వచ్చింది. ఏపీలో ఈ ఘటన సంచలనంగా మారింది.
టాస్క్‌ఫోర్స్ దాడుల్లో వెలుగులోకి అనైతిక వ్యాపారం
విశాఖ టాస్క్‌ఫోర్స్, త్రీటౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి దాడులు చేపట్టింది. స్పా సెంటర్‌లో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ ప్రాస్టిట్యూషన్ జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ జరిగింది.
పోలీసులు లోపలికి వెళ్లగానే ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ జరపగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కల్లూరు పవన్ కుమార్ (36), జానా శ్రీనివాస్ (35) లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీరిద్దరూ స్పా సెంటర్ మేనేజర్లని ధృవీకరించారు.
స్పా పేరుతో లైంగిక దోపిడీ
పోలీసుల విచారణలో షాకింగ్ వివరాలు వెలుగుచూశాయి. స్పా సెంటర్ కు కాసిరెడ్డి అరుణ్ కుమార్, రాహుల్ పేరిట అనుమతులు ఉన్నాయి. అయితే, వీరు థాయ్ మసాజ్ పేరుతో కస్టమర్ల నుంచి రూ.3,000 వసూలు చేస్తూ లైంగిక సేవలు అందిస్తున్నారని మేనేజర్లు అంగీకరించారు. దాడుల సమయంలో గదులను తనిఖీ చేయగా, చీలి రామచంద్ర ప్రసాద్ (కస్టమర్) ఒక యువతితో కలిసి ఉండటం గుర్తించారు.
దాడి సమయంలో మొత్తం 10 మంది మహిళలు, ఒక పురుష కస్టమర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మిగతా తొమ్మిది మంది మహిళలను అక్కడినుంచి రక్షించి షెల్టర్ హోంకు తరలించారు. అదనంగా ఐఫోన్ 13, నథింగ్ ఫోన్, శాంసంగ్ మొబైల్ ఫోన్, అలాగే రూ.7,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటినీ మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
ప్రధాన నిందితుల కోసం వేట.. విశాఖలో పెరుగుతున్న అనైతిక స్పా సెంటర్లు
ఈ కేసులో యజమానులు అరుణ్ కుమార్ (A1), రాహుల్ (A2) ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇప్పటికే మేనేజర్లు కల్లూరు పవన్ కుమార్ (A3), జానా శ్రీనివాస్ (A4), కస్టమర్ చీలి రామచంద్ర ప్రసాద్ (A5)లను అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని స్పా సెంటర్లు చట్టబద్ధంగా నడవాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
విశాఖ స్మార్ట్ సిటీగా ఎదుగుతున్నప్పటికీ, ఇటువంటి కార్యకలాపాలు నగర ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. సిరిపురం, ద్వారకానగర్, రామ్‌నగర్, సీతమ్మపేట ప్రాంతాల్లో కూడా ఇలాంటి స్పా సెంటర్లు విస్తరిస్తున్నాయని సమాచారం. యువతులను ఉద్యోగాల పేరుతో ఆకర్షించి, తర్వాత బలవంతంగా ప్రాస్టిట్యూషన్ లోకి దింపుతున్నారని బాధితులు చెబుతున్నారు. సోషల్ మీడియా, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ల ద్వారా కస్టమర్లను సంప్రదిస్తూ ఈ దందాను సాగిస్తున్నారని సమాచారం.
స్పా ముసుగులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను బయటపెట్టిన విశాఖ నగర పోలీసులు.
III- టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల వి.ఐ.పి రోడ్ సమీపంలో ఉన్న ఆర్చిడ్ వెల్ నేస్ & స్పా సెంటర్ మసాజ్ పేరుతో ప్రాస్టిట్యూషన్ ర్వహిస్తున్నట్లు రాబడిన నమ్మదగిన సమాచారం మేరకు, @APPOLICE100 (1/2) pic.twitter.com/SLSWMblgew— VizagCityPolice (@vizagcitypolice) November 6, 2025