విశాఖ జిల్లాలో గంట వ్యవధిలో ఇద్దరి ఆత్మహత్య

Published : Sep 12, 2019, 05:30 PM IST
విశాఖ జిల్లాలో గంట వ్యవధిలో ఇద్దరి ఆత్మహత్య

సారాంశం

విశాఖ జిల్లాలో ఇద్దరు గంట వ్యవధిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు.వీరిద్దరూ కూడ ఓకే గ్రాామానికి చెందినవారు కావడం గమనార్హం.

విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లాలోని బుచ్చయ్యపేట మండలంలోని ఆర్. భీమవరం గ్రామంలో గురువారం తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు గంట వ్యవధిలో ఇద్దరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.

మండలంలోని ఆర్. భీమవరం గ్రామానికి చెందిన బల్లిన గౌరి నాయుడు జేసీబీ అద్దెకిస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుదవారం నాడు భార్యతో గొడవ కారణంగా ఆయన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు  తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. కొన ఊపిరితో ఉన్న గౌరి నాయుడును ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

అయితే ఇదే గ్రామానికి చెందిన శ్యామల కూడ ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గౌరినాయుడు ఆత్మహత్య చేసుకొన్న గంట తర్వాత వివాహిత శ్యామల ఆత్మహత్యకు పాల్పడడంతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. 

గౌరినాయుడు వైఎస్ఆర్సీపీకి చెందిన వాడు. శ్యామల మాత్రం తాజా మాజీ సర్పంచ్ ఎం.బుుజ్జి కూతురు. వీరిద్దరి మరణంతో ఈ రెండుపార్టీలకు చెందిన  నేతలు ఆయా కుటుంబాలను పరామర్శించారు.

PREV
click me!

Recommended Stories

విశాఖలో స్పా ముసుగులో చీకటి దందా
Yoga Day: విశాఖలో యోగా డే.. ఐదు లక్షల మందితో గిన్నిస్ రికార్డు