విజయవాడ: పక్క రాష్ట్రాలకి వెళ్లి పాచిపనులు చేసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు కానీ ..
విజయవాడ: పక్క రాష్ట్రాలకి వెళ్లి పాచిపనులు చేసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు కానీ ..అమరావతిని కాపాడుకోవడానికి రెడీగా లేరు అంటూ విజయవాడలో ప్రజలను ఉద్దేశిస్తూ టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టిసీమ నాకోసం కట్టానా? నీళ్లు తాగేవాళ్లకు అర్థం కాలేదా? అని ప్రశ్నించారు. ''పోండి వాడు ఓటుకి రెండు వేలు ఇస్తాడు తీసుకొని ఓట్లు వెయ్యండి ..తర్వాత అడుక్కు తినండి'' అంటూ విజయవాడ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రజలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.