విజయవాడ దుర్గ గుడికి ఓ ఎన్నారై భక్తుడు 40 లక్షల విలువైన హారాన్ని బహూకరించాడు
విజయవాడ దుర్గ గుడికి ఓ ఎన్నారై భక్తుడు 40 లక్షల విలువైన హారాన్ని బహూకరించాడు. అట్లాంటాలో ఉండే తాతినేని శ్రీనివాస్ అనే భక్తుడు తమ కొడుకు మొదటి జీతంతో అమ్మవారికి కనకపుష్యరాగాల హారం చేయించారు. గత నెల ఆరునుండి అమ్మవారికి ఏడు వారాల నగలు అలంకరిస్తున్నామని, అందులో భాగంగా కనకపుష్యరాగాల హారం కోసం శ్రీనివాస్ ను కోరాం అని దేవస్థానం ఈవో సురేష్ బాబు తెలిపారు.