Jul 14, 2021, 4:49 PM IST
విజయవాడ: కృష్ణా జిల్లా మచిలిపట్నంలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం లభించింది. నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా బందరు మూడు స్తంభాలు సెంటర్ నుండి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంటికి చేరుకున్నారు చంద్రబాబు.టిడిపి నాయకులు కొల్లు రవీంద్ర మామ, మాజీ మంత్రి నడికుదిటి నరసింహారావు ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. దీంతో బాధలో వున్న రవీంద్రతో పాటు ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు చంద్రబాబు. నరసింహారావు చిత్ర పటానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళర్పించారు.