May 27, 2021, 10:28 AM IST
విశాఖపట్నం జిల్లాలోని గోపాలపట్నం సబ్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున 3:30గంటలకి సబ్ స్టేషన్ లో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీన్ని గమనించిన సబ్ స్టేషన్ లో పనిచేసే సిబ్బంది వెంటనే అప్రమత్తం అవడంతో ప్రాణాపాయం తప్పింది. వారు అందించిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది. మొత్తం మూడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. సబ్ స్టేషన్ లోని ఆయిల్ మండుతూ ఉండడంతో మంటలను అదుపు చేయడం కష్టమైందని ఫైర్ సిబ్బంది వెల్లడించారు.