Aug 6, 2020, 11:43 AM IST
74 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా, ఈస్ట్రన్ నావల్ కమాండ్ కరోనా వారియర్స్ కు నివాళి సమర్పించింది. విశాఖపట్నంలోని బొజ్జన కొండ హెరిటేజ్ సైట్లో కరోనా వారియర్స్ కు నివాళి నిర్వహించింది. గంటసేపు సాగిన ప్రదర్శనలో మార్షల్ మ్యూజిక్ నుండి దేశభక్తి వరకు అనేక రకాల పాటల ప్రదర్శన జరిగింది. హైదరాబాద్ దూరదర్శన్ నుండి డిడి సప్తగిరి, డిడి యాదగిరిలలో ఈ బ్యాండ్ ప్రదర్శన ప్రత్యక్ష ప్రసారం అయ్యింది. ఆగస్ట్ 1 నుండి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఉన్న మిలటరీ బృందాలు జరుపుకుంటున్నాయి.