Dec 12, 2020, 12:43 PM IST
గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం తుమ్మలచెరువు టోల్ ప్లాజా వద్ద అఖిలపక్షం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రైతులకు మద్ధతు గా టోల్ ప్లాజా వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఒక్కరోజు సహకరించి టోల్ రుసుము ఆపేయాలని రైతులకు మద్దతు తెలపాలని అఖిలపక్ష నేతలు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, సిపిఐ, సిపిఎం, ఏఐటీయూసీ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.