చంద్రబాబు పిలుపు: అమరావతికి శోభారాణి సహ అసంతృప్తులు

By narsimha lodeFirst Published Nov 19, 2018, 11:52 AM IST
Highlights

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టికెట్లు లభించక అసంతృప్తికి గురైన పార్టీ నేతలను బుజ్జగించే పనిలో తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మునిగిపోయారు

అమరావతి: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టికెట్లు లభించక అసంతృప్తికి గురైన పార్టీ నేతలను బుజ్జగించే పనిలో తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మునిగిపోయారు. అసంతృప్త నేతలను ఆయన అమరావతికి ఆహ్వానించారు. 

శోభారాణి, అరవింద్ గౌడ్ వంటి అసంతృప్త నేతలకు చంద్రబాబు పిలుపుతో అమరావతికి చేరుకున్నారు. శోభారాణి ఆలేరు టికెట్ ఆశించారు. అయితే, ఈ సీటును కాంగ్రెసు తన అభ్యర్థికి కేటాయించింది. దీంతో ఆమె కంటతడి కూడా పెట్టుకున్నారు.

ఈ స్థానం నుండి  పోటీ చేయడానికి ఆమెకు అవకాశం దక్కలేదు. మరో వైపు గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని ఏ స్థానం నుండైనా పోటీ చేస్తానని అరవింద్ కుమార్ గౌడ్ రెడీగా ఉన్నారు.ఈ తరుణంలో ఆయనకు కూడ టికెట్టు దక్కలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం స్థానాన్ని కోనేరు  చిన్ని (నాగేశ్వరరావు) ఆశించారు.కానీ  ఈ స్థానం పొత్తులో భాగంగా కాంగ్రెస్  పోటీ చేస్తోంది. 

ఖైరతాబాద్ నుండి  ఎం.ఎన్ రెడ్డి పోటీ చేయాలని భావించారు. కానీ, పొత్తులో భాగంగా  ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ పోటీకి దిగింది.  దీంతో  ఎం ఎన్ రెడ్డి అనుచరులు ఇటీవల ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎదుట విద్యుత్ స్థంబం ఎక్కి ఆందోళన చేశారు.

టికెట్టు ఆశించి కూడ టికెట్లు దక్కని అసంతృప్తులను చంద్రబాబునాయుడు బుజ్జగిస్తున్నారు. ఈ మేరకు   ఇంకా అసంతృప్తులందరిని గుర్తించి  బాబు పిలిపించారు. అసంతృప్తులతో  బాబు  బుజ్జగింపులు చేస్తున్నారు. ఏ కారణాలతో  టికెట్లు దక్కలేదు.. భవిష్యత్తులో  ఏ రకమైన  న్యాయం చేస్తామని  బాబు  అసంతృప్తులకు హామీలు ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి సుహాసిని ఆస్తులివే

కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సుహాసిని

సుహాసినికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై స్పందించిన బాలయ్య

ఎన్టీఆర్‌‌కు నివాళులర్పించిన నందమూరి సుహాసిని

బరిలోకి సుహాసిని: తెర వెనక భువనేశ్వరి

మాధవరం తెలుగుదేశం ద్రోహి, అతన్ని ఓడిస్తా.. సుహాసిని నా బిడ్డ: పెద్దిరెడ్డి

అందుకే రాజకీయాల్లోకి వచ్చా, తండ్రిని తల్చుకొని కన్నీళ్లు పెట్టుకొన్న సుహాసిని

హరికృష్ణ సానుభూతి, ఎన్టీఆర్ ఛరిష్మా: టీడీపీ తురుపుముక్క సుహాసిని

నందమూరి సుహాసినీపై.. మిత్రపక్షం కాంగ్రెస్ తిరుగుబాటు

కూకట్‌పల్లి సుహాసినికి కేటాయింపు: బాబు వద్దకు పెద్దిరెడ్డి

మీడియా ముందుకు నందమూరి సుహాసిని

33 ఏళ్ల తర్వాత తెలంగాణలో నందమూరి ఫేటు ఎలా ఉందో, నాడు ఎన్టీఆర్...నేడు సుహాసిని

‘‘ఆ’’ సాయమే హరికృష్ణ కుమార్తె సుహసిని మనసు మార్చిందా..?

హరికృష్ణ కుమార్తెకే కూకట్ పల్లి టిక్కెట్, 17న సుహాసిని నామినేషన్

సుహాసిని కోసం జూ.ఎన్టీఆర్: ప్రచారానికి బాలయ్య, విజయశాంతి జోడి

చంద్రబాబుతో భేటీ: కూకట్‌పల్లి సీటు హరికృష్ణ కూతురు సుహాసినికే

తెరపైకి హరికృష్ణ కూతురి పేరు: కూకట్‌పల్లిపై ఉత్కంఠ

హరికృష్ణ కూతురు పోటీకి జూ.ఎన్టీఆర్ బ్రేక్

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?

 

 

click me!